...
...
Next Story

రెండు భాగాలుగా ప్రభాస్ ఫౌజీ మూవీ.. ప్రీక్వెల్‌గా రెండో సినిమా.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ హను రాఘవపూడి

ప్రభాస్, ఇమాన్వీ లీడ్ రోల్స్ లో వస్తున్న ఫౌజీ మూవీ కూడా రెండు భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని వెల్లడించిన డైరెక్టర్ హను రాఘవపూడి దీనికి కారణమేంటో చెప్పాడు. రెండో సినిమా ప్రీక్వెల్ కానుండటం విశేషం.

Published on: Nov 17, 2025, 15:14:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మరో భారీ బడ్జెట్ మూవీ కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కి అనుగుణంగా రెండు భాగాలుగా రానుంది. 'బాహుబలి' తరువాత వచ్చిన అనేక భారీ చిత్రాలు అనవసరంగా సీక్వెల్స్ ను తీసుకొస్తుండటంతో ప్రేక్షకులకు కూడా విసుగొస్తోంది. పుష్ప, కేజీఎఫ్ లాంటి మూవీస్ సీక్వెల్స్ మాత్రమే అంచనాలను అందుకోగా.. మిగిలినవాటిలో చాలా వరకు బోల్తా పడ్డాయి. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఫౌజీని కూడా రెండు భాగాలుగా తీసుకురావడానికి కారణమేంటో డైరెక్టర్ హను రాఘవపూడి వెల్లడించాడు.

'ఫౌజీ' రెండు భాగాలుగానే..

రెండు భాగాలుగా ప్రభాస్ ఫౌజీ మూవీ.. ప్రీక్వెల్‌గా రెండో సినిమా.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ హను రాఘవపూడి (Instagram/imanvi1013)
రెండు భాగాలుగా ప్రభాస్ ఫౌజీ మూవీ.. ప్రీక్వెల్‌గా రెండో సినిమా.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ హను రాఘవపూడి (Instagram/imanvi1013)

ప్రభాస్, ఇమాన్వీ జంటగా వస్తున్న మూవీ ఫౌజీ. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ 'ఫౌజీ' మూవీ రెండు భాగాలుగా విడుదలవడం ఖాయమైంది. ఇందులో రెండవ భాగం ప్రిక్వెల్‌గా ఉంటుందని డైరెక్టర్ హను తెలిపాడు. రెండో భాగం ఇండియా వలస పాలన కాలం నాటి చరిత్రను, మరో కోణాన్ని అన్వేషిస్తుందని అతడు చెప్పాడు.

పీటీఐకి ఇచ్చిన ఒక ప్రకటనలో హను ఏమన్నాడో చూడండి. "మేము ఈ సినిమాలో ప్రభాస్ ఒక ప్రపంచాన్ని చిత్రీకరిస్తున్నాము. రెండవ భాగం మరొక కోణాన్ని అన్వేషిస్తుంది. మన వలస పాలన చరిత్రలో చాలా కథాంశం ఉంది. విషాదంగా ముగిసినప్పటికీ, మరో రియాలిటీలో అద్భుత కథలుగా మారగలిగే కథలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా స్ఫూర్తినిచ్చిన కొన్ని నిజ జీవిత అనుభవాలను కూడా నేను ఇందులో జోడించాను" అని హను చెప్పాడు.

ఫౌజీ మూవీ గురించి..

ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ టైటిల్ ను ఈ మధ్యే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడితో అతనికిదే తొలి మూవీ. ఇది చారిత్రక ఘటనల ఫిక్షనల్ స్టోరీగా వస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో "ఒంటరిగా పోరాడే బెటాలియన్" అనే ట్యాగ్‌లైన్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో అన్ని దక్షిణాది భాషలు, హిందీలో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాలకూ సీక్వెల్స్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks