స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే మమితా జుట్టు పట్టుకొని లాగిన ప్రదీప్.. అస్సలు క్యూట్‌గా లేదంటూ హీరోయిన్ రియాక్షన్

ప్రదీప్ రంగనాథన్ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. డ్యూడ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ సీన్ రీక్రియేట్ చేస్తూ హీరోయిన్ మమితా బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకొని లాగి నానా రచ్చ చేశాడు.

Published on: Oct 16, 2025, 18:53:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు 'డ్యూడ్' సినిమా రిలీజ్ కోసం సిద్ధమైంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్రదీప్, మమితా స్టేజ్ మీద సినిమాలోని ఒక సీన్‌ని 'క్యూట్‌'గా రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ప్రదీప్.. మమితా జుట్టు పట్టుకొని లాగడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. అందులో 'క్యూట్' ఏమీ లేదని అన్నారు.

స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే మమితా జుట్టు పట్టుకొని లాగిన ప్రదీప్.. అస్సలు క్యూట్‌గా లేదంటూ హీరోయిన్ రియాక్షన్
స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే మమితా జుట్టు పట్టుకొని లాగిన ప్రదీప్.. అస్సలు క్యూట్‌గా లేదంటూ హీరోయిన్ రియాక్షన్

ప్రదీప్ ఏం చేశాడంటే?

డ్యూడ్ మూవీలోని ఓ సీన్‌ను రీక్రియేట్ చేసిన ప్రదీప్, మమితా స్టేజ్ పై రీక్రియేట్ చేశారు. ట్రైలర్‌లోని సీన్‌లో మమితా క్యారెక్టర్, ప్రదీప్ క్యారెక్టర్ చెంపలు గిల్లుతుంది. అప్పుడు అతను 'దీంట్లో అంత క్యూట్ ఏముంది?' అని ఆమెను ఆపుతాడు. అయితే, స్టేజ్ మీద ప్రదీపే మమితా చెంపలు గిల్లాడు. అంతేకాకుండా వెనక నుంచి ఆమె జుట్టు కూడా పట్టుకొని లాగాడు.

ఆ తర్వాత సరదాగా ఆమెను కాలితో తన్నాడు. ఆడియన్స్ ఏమో చప్పట్లు కొట్టారు. ఆమె మాత్రం “ఇది క్యూట్‌గా లేదు. ఓకే?” అని అంది. అతను తలూపి ఆమె పక్కన నిల్చున్నాడు. దాంతో ఆ యాక్ట్ ముగిసింది. ఏదైనా ఓ డైలాగ్ చెప్పమని యాంకర్ అడుగుతున్నా ప్రదీప్ మాత్రం ఇలా చేయడం చాలా మంది షాక్ కు గురి చేసింది.

ఇంటర్నెట్ రియాక్షన్ ఇలా..

డ్యూడ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా స్టేజ్ మీద జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చాలా మందికి నచ్చలేదు. ఒక యూజర్ స్పందిస్తూ.. “ఇది అస్సలు క్యూట్‌గా లేదు” అని అన్నారు. ఇంకొకరు స్పందిస్తూ.. “ఈ ఒక్క మూమెంట్ చాలు, ఈ యాక్టర్‌లో ఏమేం తప్పులున్నాయో చెప్పడానికి. స్టేజ్ మీద వాళ్లు నటుల కంటే నిజమైన మనుషులుగా ఉంటారు.

అలాంటి చోట ఒకరిని అవమానించే సీన్‌ను రీక్రియేట్ చేయాలని ఎంచుకున్నాడు. ఆ సమయంలో చూసేవాళ్లకు వాళ్లిద్దరూ ఒక్కరిగానే కనిపిస్తారు. అక్కడ జనం ఎలా అరుస్తున్నారో వినండి. ప్రదీప్ ఏం చేస్తున్నాడో అతనికి కరెక్ట్‌గా తెలుసు” అని అన్నారు. “సీన్ రీక్రియేషన్ ఓకే, కానీ ఆ అమ్మాయి జుట్టు అలా లాగొద్దురా ఫూల్” అని ఒక కామెంట్ ఉంది. “ఇది చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది” అని ఇంకొకరు అన్నారు.

'డ్యూడ్' సినిమాకి డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ప్రదీప్, మమితాతో పాటు నేహా శెట్టి, ఆర్. శరత్‌కుమార్, హృదు హరూన్, రోహిణి కూడా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More