Web Series: ఆ చెత్త గవర్న్‌మెంట్ స్కూలు కేంబ్రిడ్జ్ వెళ్తుందా.. ప్రైమ్ వీడియోలోకి వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ ట్రైలర్

Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతున్న ఆదర్శ్ బాల్ విద్యాలయ ట్రైలర్ సోమవారం (జులై 13) రిలీజ్ చేశారు. ఓ గవర్న్‌మెంట్ స్కూలు, అందులో అస్సలు క్రమశిక్షణ లేని స్టూడెంట్స్, టీచర్ల చుట్టూ తిరిగే ఫన్నీ స్టోరీతో వస్తున్న సిరీస్ ఇది.

Published on: Jul 13, 2026, 14:16:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Web Series: విలక్షణ నటుడు కే కే మీనన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' (Adarsh Baal Vidyalaya) ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక అట్టడుగున ఉన్న ప్రభుత్వ పాఠశాలను లండన్‌లోని కేంబ్రిడ్జ్ స్థాయికి తీసుకెళ్లాలనుకునే హెడ్‌మాస్టర్ ప్రయత్నం, ఆ క్రమంలో ఎదురయ్యే నవ్వులు, ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ హిలేరియస్ సిరీస్ ట్రైలర్ విశేషాలు, విడుదల తేదీ వివరాలు మీకోసం.

Web Series: ఆ చెత్త గవర్న్‌మెంట్ స్కూలు కేంబ్రిడ్జ్ వెళ్తుందా.. ప్రైమ్ వీడియోలోకి వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ ట్రైలర్
Web Series: ఆ చెత్త గవర్న్‌మెంట్ స్కూలు కేంబ్రిడ్జ్ వెళ్తుందా.. ప్రైమ్ వీడియోలోకి వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ ట్రైలర్

ఆకట్టుకుంటున్న 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' ట్రైలర్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న మరో క్రేజీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కే కే మీనన్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఆదర్శ్ బాల్ విద్యాలయ’ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఒక విభిన్నమైన విద్యా వ్యవస్థ నేపథ్యంలో చాలా ఫన్నీగా సాగే ఈ ఏడు ఎపిసోడ్‌ల కామెడీ-డ్రామా సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతోంది.

అసలు కథేంటి? ట్రైలర్ ఎలా ఉందంటే..

ఈ ఆదర్శ్ బాల్ విద్యాలయ వెబ్ సిరీస్‌లో కే కే మీనన్ 'జ్ఞానేశ్వర్ త్రిపాఠి' అనే బద్ధకస్తుడైన ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ పాత్రలో కనిపించారు. ఆయన పని చేసే స్కూల్ నగరంలోనే అత్యంత దారుణమైన ట్రాక్ రికార్డ్ ఉన్నదిగా నిలుస్తుంది. క్రమశిక్షణ లేని విద్యార్థులు, బాధ్యత లేని ఉపాధ్యాయులు, వసతుల లేమితో ఆ స్కూల్ నడుస్తుంటుంది.

అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక స్కీమ్ ప్రకారం.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల సిబ్బందిని లండన్‌లోని ప్రఖ్యాత 'కేంబ్రిడ్జ్' యూనివర్సిటీకి ఉచిత శిక్షణ కోసం పంపుతారు.

లండన్ వెళ్లాలనే బలమైన కోరికతో ఉన్న జ్ఞానేశ్వర్ త్రిపాఠి.. తన స్కూల్‌ను ఎలాగైనా మార్చాలని డిసైడ్ అవుతాడు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. “పిల్లల కంటే ముందు, స్కూల్ పాస్ అవ్వాలి” అనే నిబంధన విధిస్తారు. దాంతో ఆ దారుణమైన స్కూల్‌ను మార్చేందుకు ఆయన వేసే ప్లాన్లు, టీచర్లు చేసే రచ్చ, పేరెంట్స్ నుంచి వచ్చే అభ్యంతరాలు వంటి అంశాలను ట్రైలర్‌లో అత్యంత హాస్యభరితంగా చూపించారు.

సీనియర్ నటీనటులతో..

ఈ వెబ్ సిరీస్‌ను పాపులర్ డిజిటల్ క్రియేటర్స్ బిశ్వపతి సర్కార్, సమీర్ సక్సేనా (పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్) సంయుక్తంగా క్రియేట్ చేయగా, హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు.

కే కే మీనన్‌తో పాటు ఈ సిరీస్‌లో భారీ తారాగణమే ఉంది. సీనియర్ నటి అర్చన పూరన్ సింగ్, నవీన్ కస్తూరియా, ప్రసన్న బిష్త్, అభిమన్యు సింగ్, దేవన్ భోజాని, అజితేష్ గుప్తా, అన్నపూర్ణ సోని, ప్రాచీ షా కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కే కే మీనన్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

'ఆదర్శ్ బాల్ విద్యాలయ' వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా జులై 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఏడు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ హిందీతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో దాదాపు 240 కి పైగా దేశాల్లో అందుబాటులోకి రానుంది.

స్కూల్ లైఫ్ నోస్టాల్జియాను, నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను నవ్వుల రూపంలో చూపించబోతున్న ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో ఒక మంచి క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం చూసేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More