సినిమాలు మానేసి గడ్డి పీకాల్నా: నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రియదర్శి.. అసలు ఏం జరిగిందంటే?
తనను సినిమాలు మానేయమన్న ఓ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు నటుడు ప్రియదర్శి పులికొండ. అతడు నటించిన ప్రేమంటే మూవీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రియదర్శి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రియదర్శి పులికొండ, ఆనంది లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ప్రేమంటే. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 21) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉండగా.. ఓ అభిమాని ఎక్స్ ద్వారా ప్రియదర్శిని సినిమాలు మానేయమని సలహా ఇచ్చాడు. దీనికి అతడు ఇచ్చిన కౌంటర్ అభిమానులను ఆకర్షిస్తోంది.

మరి గడ్డి పీకాల్నా?
ప్రియదర్శి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ సినిమాల్లో తన మార్క్ తెలంగాణ డైలాగులతో అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా తనకు సినిమాలు మానేయాలని సలహా ఇచ్చిన అభిమానికి అదే స్టైల్లో కౌంటర్ ఇవ్వడం విశేషం.
“నువ్వు సినిమాలు తీయడం ఆపు అన్నా ప్లీజ్ అన్నా” అని ఓ ఫ్యాన్ ట్వీట్ చేస్తూ ప్రియదర్శిని ట్యాగ్ చేశాడు. దీనిపై అతడు స్పందించాడు. “మరి ఏం చెయ్యమంటావ్.. గడ్డి పీకాల్నా” అని ప్రియదర్శి అన్నాడు. ఈ రిప్లై అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది.
ప్రియదర్శి ప్రేమంటే మూవీ గురించి..
కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ప్రేమంటే సినిమాలో ప్రియదర్శి, ఆనంది లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్, సుమ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ గత సోమవారం (నవంబర్ 17) రిలీజ్ అయింది.
ఈ మధ్యే సారంగపాణి జాతకం, మిత్ర మండలి సినిమాలతో వచ్చి బోల్తా పడిన ప్రియదర్శి మరోసారి పూర్తి కామెడీనే నమ్ముకున్నాడు. నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి కాకపోవడంతో ఇబ్బంది పడే మది (మధుసూదన్) అనే పాత్రలో ప్రియదర్శి కనిపించాడు.
ఎన్నో సంబంధాలు చెడిపోయిన తర్వాత చివరికి అతనికి పెళ్లి అవుతుంది. అయితే అప్పుడే అతని కష్టాలు మొదలవుతాయి. ఇంతలో పెళ్లంటేనే పప్పన్నం.. ఆ పప్పే మాడిపోయిన తర్వాత ఇంకేం లాభం అంటూ సుమా ఎంట్రీ ఇస్తుంది. సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు అని ఆమె చెప్పే డైలాగుతోనే ఈ ట్రైలర్ ముగుస్తుంది.
ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫుల్ కామెడీతో సాగిపోయిన ట్రైలర్ చూస్తుంటే.. మూవీపై అంచనాలు పెరిగాయి. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా మూవీ తీసినట్లు కనిపిస్తోంది. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనే ట్యాగ్‌లైన్ ఈ మూవీకి పెట్టడం విశేషం. మరి ఈ సినిమాతో అయినా ప్రియదర్శి మళ్లీ గాడిలో పడతాడో లేదో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


