Priyanka Chopra Daughter: గాయత్రి మంత్రం చదివిన ప్రియాంకా చోప్రా కూతురు.. వారణాసి సెట్స్‌లో ప్రొడ్యూసర్‌గా మారి..
Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో కలిసి గడిపిన మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అందులో చిన్నారి గాయత్రి మంత్రం పఠిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి ఒడిలో కూర్చుని ఎంతో స్పష్టంగా పాడిన మాల్తీ వాయిస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Priyanka Chopra Daughter: హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంటారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. వీలున్నప్పుడల్లా తన గారాలపట్టిని షూటింగ్ సెట్స్‌కు కూడా వెంట తీసుకెళ్తుంటారు.

తాజాగా గురువారం (నవంబర్ 19) ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బీచ్ వెకేషన్, ఫ్యామిలీ మూమెంట్స్, షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. అందులో చిన్నారి మాల్తీ తన ముద్దుముద్దు మాటలతో గాయత్రి మంత్రం పఠిస్తున్న వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
అంతేకాకుండా ప్రియాంక షూటింగ్ సెట్స్‌లో 'ప్రొడ్యూసర్' అని రాసి ఉన్న హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, స్క్రిప్ట్ చదువుతున్న మాల్తీ క్యూట్ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తల్లి ఒడిలో కూర్చుని గాయత్రి మంత్రం.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియోలో, ఇంట్లోని చిన్న పూజా మందిరం ముందు ప్రియాంక కూర్చోగా.. ఆమె ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల మాల్తీ మేరీ “ఓం భూర్భువస్వః” అంటూ ఎంతో స్పష్టంగా, శ్రావ్యంగా గాయత్రి మంత్రం పఠించింది.
మంత్రం పూర్తి కాగానే ప్రియాంక ఎంతో సంతోషంతో “చాలా అందంగా పాడావు” అంటూ కూతురిని ప్రశంసించారు. “ఈమధ్య కాలంలో.. బిజీ షెడ్యూల్స్ మధ్య ఒక కలల ప్రదేశంలో.. సౌండ్ ఆన్ చేసి వినండి” అంటూ ప్రియాంక ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
విదేశాల్లో పెరుగుతున్నప్పటికీ తన కూతురికి భారతీయ సంప్రదాయాలను నేర్పిస్తున్న ప్రియాంకను అభిమానులు కొనియాడుతున్నారు. బ్రిటిష్/అమెరికన్ యాక్సెంట్లో మాల్తీ పాడిన తీరు పాప్ స్టార్లా ఉందని, భవిష్యత్తులో తను గొప్ప సింగర్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.
షూటింగ్ సెట్స్‌లో 'ప్రొడ్యూసర్' అవతారమెత్తిన మాల్తీ
ఈ ఫోటో ఆల్బమ్‌లో బీచ్ ఒడ్డున ఇసుకలో బొమ్మలు గీస్తున్న మాల్తీ.. సముద్రంలో కుటుంబంతో కలిసి సర్ఫింగ్ చేస్తున్న దృశ్యాలతో పాటు షూటింగ్ సెట్స్‌లోని కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలు కూడా ఉన్నాయి.
ఒక ఫోటోలో మాల్తీ చెవులకు "ప్రొడ్యూసర్" అని రాసి ఉన్న హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, ఎంతో సీరియస్‌గా సినిమా స్క్రిప్ట్ పేపర్లను పరిశీలిస్తూ కనిపించింది. గతంలో 'హెడ్స్ ఆఫ్ స్టేట్' షూటింగ్ సమయంలోనూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎస్.ఎస్. రాజమౌళి సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రియాంక తన కూతురిని భారత్‌కు తీసుకొచ్చారు. సెట్స్‌లో ఉండే 'క్రాఫ్ట్ సర్వీసెస్'ను నటీనటుల తరహాలోనే మాల్తీ కూడా ముద్దుగా 'క్రాఫ్టీ' అని పిలుస్తుందని ప్రియాంక గతంలో ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పారు.
రాజమౌళి - మహేష్ బాబు 'వారణాసి'తో గ్రాండ్ రీఎంట్రీ
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ చిత్రసీమలోకి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'రుద్ర'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా నటిస్తున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక 'మందాకిని' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
సుమారు రూ.1,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ షూటింగ్ ఇటీవలే పూర్తికాగా, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ (VFX) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న 'వారణాసి' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


