We Were Here: ఏఐకి పోటీగా మిషన్లుగా మారిన అంకుల్స్-20 అవార్డ్స్- ఆస్కార్ రేసులో భారత షార్ట్ ఫిల్మ్-అండగా ప్రియాంక చోప్రా

We Were Here Priyanka Chopra Supports: ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయంతో వినూత్న నిరసన తెలిపే ముగ్గురు అంకుల్స్ కథతో తెరకెక్కిన వి వర్ హియర్ షార్ట్ ఫిల్మ్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ప్రణవ్ భాసిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్ పోటీకి అర్హత సాధించింది. ప్రియాంక చోప్రా అండగా నిలిచింది.

Published on: Nov 6, 2026, 14:24:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Priyanka Chopra Supports To We Were Here Short Film: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థ మనుషుల ఉద్యోగాలను మింగేస్తోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న సాంకేతికతపై ఒకవైపు భయాలు, మరోవైపు విశ్లేషణలు నడుస్తున్న వేళ.. ముంబైకి చెందిన యంగ్ డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ ఒక సరదా ఆలోచనను అద్భుతమైన కథనంగా మలిచారు.

ఏఐకి పోటీగా మిషన్లుగా మారిన అంకుల్స్-20 అవార్డ్స్- ఆస్కార్ రేసులో భారత షార్ట్ ఫిల్మ్-అండగా ప్రియాంక చోప్రా
ఏఐకి పోటీగా మిషన్లుగా మారిన అంకుల్స్-20 అవార్డ్స్- ఆస్కార్ రేసులో భారత షార్ట్ ఫిల్మ్-అండగా ప్రియాంక చోప్రా

అంతర్జాతీయ వేదికలపై వి వర్ హియర్

'వి వర్ హియర్' (We Were Here) పేరుతో ఆయన రూపొందించిన ఈ కామెడీ మాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్ పేరును మారుమోగిస్తోంది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

టీవీలు, ఫ్రిజ్లుగా మారిన ముగ్గురు పెద్దాయనలు!

చిన్న పట్టణానికి చెందిన ముగ్గురు రిటైర్డ్ అంకుల్స్ ఈ కథలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మనుషుల ఉద్యోగాలు పోతున్నాయని నమ్మే ఈ పెద్దాయనలు, ఏఐకి ఎదురుతిరగడానికి ఒక వినూత్న నిరసనను ఎంచుకుంటారు. ఇంట్లోని గృహోపకరణాలు (హోమ్ అప్లయన్సెస్) లాగా అంటే టీవీ, ఫ్రిజ్‌లా తాము నటిస్తూ విచిత్రమైన పోరాటం ప్రారంభిస్తారు.

ఏఐ కంపెనీలో ఉద్యోగం రావడంతో

అయితే, ఈ ముగ్గురిలో ఒకరి కొడుక్కు ఏఐ కంపెనీలోనే ఉద్యోగం రావడంతో కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. నవ్వులు పూయించే వినోదంతో పాటు నేటి తరం ఆలోచనలను, పాత తరం భయాలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని ప్రణవ్ భాసిన్ చాలా సహజంగా తెరకెక్కించారు.

80కి పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్.. 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు

ఒక చిన్న హాస్యభరిత ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80కి పైగా ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఏకంగా 20కి పైగా అంతర్జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది.

ఆస్కార్ రేసులో వి వర్ హియర్

అమెరికాలోని ప్రసిద్ధ 'ఎస్ఎక్స్ఎస్డబ్ల్యూ' (SXSW) ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'బెస్ట్ నరేటివ్ షార్ట్' కేటగిరీలో ఆడియెన్స్ అవార్డును గెలుచుకుంది. పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫెస్ట్‌లో 'బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్' సహా రెండు ప్రధాన అవార్డులను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో ఈ చిన్న చిత్రం ఏకంగా ఆస్కార్ (Academy Awards) రేసులో పోటీపడే అర్హతను సాధించడం విశేషం.

అండగా నిలిచిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా

ఈ లఘు చిత్రం సాధిస్తున్న విజయాలను చూసి అంతర్జాతీయ దిగ్గజాలు దీనికి అండగా నిలుస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. ఆమెతో పాటు టోనీ అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త 'వి' (గతంలో ఈవ్ ఎన్స్‌లర్), హాలీవుడ్ నటుడు ఆండ్రూ స్కాట్ ఈ ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా చేరారు.

కోట్లాది అంతర్జాతీయ ప్రేక్షకులు చూసేలా

ప్రపంచ ప్రసిద్ధ మ్యాగజైన్ 'ది న్యూయార్కర్' ఈ చిత్రాన్ని తమ 'స్క్రీనింగ్ రూమ్' ప్లాట్‌ఫామ్ కోసం కొనుగోలు చేసింది. దీనివల్ల భారతీయ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ కోట్లాది మంది అంతర్జాతీయ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సరైన ఆలోచన, బలమైన భావోద్వేగం ఉంటే చిన్న కథ కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని 'వి వర్ హియర్' నిరూపించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More