SS Rajamouli: వారణాసిలో ఏఐ వాడటం లేదు.. 1500 మంది వాయిస్ ఆర్టిస్టులు.. 50 భాషల్లో రిలీజ్: రాజమౌళి కామెంట్స్
SS Rajamouli: వారణాసి మూవీ విషయంలో ఏఐ వాడకంపై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ మూవీలో ఏఐని వాడటం లేదని, 50 భాషల్లో రిలీజ్ కోసం ఏకంగా 1500 మంది వాయిస్ ఆర్టిస్టులను ఆడిషన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
SS Rajamouli: సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మైథలాజికల్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అయితే ఈ మూవీ ప్రొడక్షన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై వస్తున్న పుకార్లకు దర్శకధీరుడు రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టారు. జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ జనరేటివ్ ఏఐ పట్ల తనకు ఉన్న సందేహాలను ఓపెన్‌గా పంచుకున్నారు.

ఫిల్మ్ మేకింగ్‌లో సాంకేతికత వాడకం పెరిగినప్పటికీ, మనుషుల ఎమోషన్స్, క్రియేటివిటీని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని జక్కన్న స్పష్టం చేశారు.
రీసెర్చ్‌కి ఏఐ ఓకే.. క్రియేటివిటీకి మాత్రం డౌటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు ఎటు వెళ్తుందో ఊహించడం చాలా కష్టమని రాజమౌళి అన్నారు. ప్రొడక్షన్ రీసెర్చ్, ఆర్ అండ్ డి (R&D), ప్రాథమిక పనులకు ఏఐ ఒక గొప్ప అసిస్టెంట్‌గా ఉపయోగపడుతుందని కొనియాడారు. గతంలో వారాలు, నెలలు పట్టే పనులు ఇప్పుడు కొద్ది గంటల్లోనే పూర్తవుతున్నాయని అంగీకరించారు.
అయితే జనరేటివ్ ఏఐ విషయంలో మాత్రం తాను స్క్రిప్టికల్‌గా (సందేహాస్పదంగా) ఉన్నట్లు రాజమౌళి వ్యాఖ్యానించారు. సినిమా క్రియేటివ్ ప్రాసెస్ లేదా డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ కోసం తాము ఏఐ పై ఆధారపడట్లేదని, కేవలం ఒక సపోర్టింగ్ టూల్‌గా మాత్రమే వాడుతున్నామని తెలిపారు.
1500 మంది డబ్బింగ్ ఆర్టిస్టుల వేట.. ఏఐ వాయిస్‌లకు రాజమౌళి నో
'వారణాసి' సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో ఏకంగా 50 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కృత్రిమ ఏఐ వాయిస్‌లను వాడటానికి రాజమౌళి పూర్తిగా నిరాకరించారు. మనుషుల గొంతులోనే నిజమైన ఎమోషన్, డెప్త్ ఉంటాయని ఆయన నమ్ముతున్నారు.
ఇందుకోసం ఏకంగా 1,500 మంది రియల్ వాయిస్ ఆర్టిస్టులను ఆడిషన్ చేసి నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. నటీనటులు పండించిన భావోద్వేగాలు వేరే భాషల్లోనూ అంతే ఇంటెన్స్‌గా పండాలంటే మనుషుల డబ్బింగ్ వాయిస్ మాత్రమే సెట్ అవుతుందని తేల్చి చెప్పారు.
2027 ఉగాదికి బాక్సాఫీస్ సునామీ.. బిగ్గెస్ట్ గ్లోబల్ ప్రాజెక్ట్
'ఆర్‌ఆర్‌ఆర్' సృష్టించిన గ్లోబల్ సెన్సేషన్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ కమ్ హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా అలరించబోతున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై విజయేంద్ర ప్రసాద్ కథతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పాన్ వరల్డ్ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించడానికి ఈ టీమ్ సిద్ధమవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


