రజనీకాంత్ తో కమల్ హాసన్ మెగా మూవీ.. ఎవరూ ఊహించని యంగ్ డైరెక్టర్.. ఒకే సినిమాతో బంపరాఫర్.. కొత్త దర్శకుడు ఎవరంటే?
రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో మెగా మూవీ రాబోతుంది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే అనూహ్యంగా సుందర్ సి డైరెక్టర్ గా తప్పుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను ఓ యంగ్ డైరెక్టర్ కు అప్పగించడం వైరల్ గా మారింది.
రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ ను మళ్లీ చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తలైవర్ 173 సినిమాతో అది నిజం కానుంది. అయితే ఈ మూవీకి కమల్ హాసన్ ప్రొడ్యూసర్. రజనీకాంత్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ను ఇవాళ (జనవరి 3) అనౌన్స్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తికి బంపరాఫర్ దక్కింది.

తలైవర్ 173 డైరెక్టర్
రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఓ మూవీ తెరకెక్కించనుంది. మొదట దీనికి సుందర్.సి డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ ఆయన తప్పుకొన్నాడు. ఇప్పుడు సస్పెన్స్ కు తెరదించుతూ కొత్త డైరెక్టర్ గా యువ దర్శకుడు సిబి చక్రవర్తి పేరును ప్రకటించారు. 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పొంగల్ 2027 కోసం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిబి చక్రవర్తికి ఛాన్స్
తలైవర్ 173 సినిమాను సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నట్లు శనివారం రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ శనివారం ధృవీకరించింది. ఓ ప్రకటనలో.. "ప్రతి హీరోకు ఒక కుటుంబం ఉంటుంది. ఆరంభికాలమా, తలైవర్ 173, సూపర్ స్టార్ పొంగల్ 2027 అని’’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కమల్ హాసన్ కూడా ఓ పోస్టులో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు.
ఎవరో అనుకుంటే?
సుందర్ సి దర్శకుడిగా తప్పుకోవడంతో తలైవర్ 173 మూవీకి డైరెక్టర్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ ఇలా స్టార్ డైరెక్టర్ల గురించి చర్చలు వచ్చాయి. కానీ చివరకు అనూహ్యంగా సిబి చక్రవర్తికి ఆ అవకాశం దక్కింది. చక్రవర్తి ఇప్పటివరకూ ఒకే సినిమాను డైరెక్ట్ చేశాడు. శివ కార్తికేయన్ హీరోగా చక్రవర్తి తీసిన డాన్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతకుముందు అట్లీ దగ్గర శిష్యుడిగా చేశాడు చక్రవర్తి.
కల నెరవేరిందని
"ఒకసారి ఒక చిన్న పట్టణ కుర్రాడి పెద్ద కల తన అభిమాన స్టార్ అయిన "సూపర్ స్టార్"ని కలవడం, అతనితో ఫోటో దిగడం. ఇది సినిమా పట్ల అతని అభిరుచిని పెంచింది. ఆ కల తీరింది. అప్పుడు సూపర్ స్టార్ కు దర్శకత్వం వహించాలనే పెద్ద కల మొదలైంది. అతను అది ఒక రోజు జరుగుతుందని నమ్మడం కొనసాగించాడు. ఈ రోజు ఆ రోజే. కలలు నిజమవుతాయి. అద్భుతాలు జరుగుతాయి’’ అని సిబి చక్రవర్తి సంతోషంలో మునిగిపోయాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


