ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడేవారికి ఈ మూవీతో ధైర్యం వస్తుంది, సీక్రెట్‌గా చర్చించుకునేది కాదు: నిర్మాత శ్రీధర్ రెడ్డి
మేల్ ఫెర్టిలిటీ సమస్యలపై సెటైరికల్ అండ్ కామెడీ ఎమోషనల్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఈ మూవీ విశేషాలను ప్రొడ్యూసర్స్ పంచుకున్నారు.
మగవారిలో వచ్చే సంతాన సమస్యలపై తెరకెక్కిన సినిమానే సంతాన ప్రాప్తిరస్తు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంతాన ప్రాప్తిరస్తు విశేషాలు
విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైంది. అయితే, ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి పంచుకున్నారు.
ఈ సమస్య కోసమా బాధపడింది
-ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. మనం ఈ సమస్య కోసమా ఇంత బాధపడింది అనుకుంటారు. టైటిల్ విషయంలో మొదట్లే ఏంటీ టైటిల్ అనుకునేవారు కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యాక "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టైటిల్ బాగుంది అంటున్నారు.
శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు
-స్క్రిప్ట్ దశలో నాకు, సంజీవ్‌కు ఫస్ట్ వచ్చిన టైటిల్ సంతాన ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ముందుగా టైటిల్ అనుకున్నా, అది లెంతీగా ఉందని "సంతాన ప్రాప్తిరస్తు" ఫిక్స్ చేశాం.
ప్రేక్షకుల టేస్ట్ మారింది
-పాండమిక్ ముందు మనకు వరల్డ్ సినిమా తెలియదు. కరోనా టైమ్‌లో మనమంతా ఓటీటీల్లో డిఫరెంట్ జోనర్స్ కంటెంట్ చూశాం. గతంలో తెలుగులో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్‌తో మూవీస్ ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఆదరణ పొందలేదు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్, ట్రెండ్ మారింది.
ఇంట్లోవాళ్లకే చూపించలేకపోయేవాన్ని
-"సంతాన ప్రాప్తిరస్తు" ట్రైలర్ను ఓ నాలుగేళ్ల కిందట అయితే నేను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఇది సీక్రెట్గా చర్చించుకునే విషయం కాదు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి.
ఓపెన్‌గా మాట్లాడుకోవాలి
-మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో "సంతాన ప్రాప్తిరస్తు" 2 చేయాలనుకుంటున్నాం.
మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
-మా మూవీని మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెబుతున్నాం. ఎందుకంటే సినిమాలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. మా మూవీ మ్యూజిక్ ఆల్ ఇండియాలో 15వ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంటే, ట్రైలర్ ఆలిండియాలో 32వ ప్రేస్‌లో ట్రెండ్ అవుతోంది.
డబ్బులు ఛార్జ్ చేయలేదు
-ఇతరుల పాటల్ని తమ సినిమాలో వాడుకుంటే తప్పకుండా ఎన్‌వోసీ తీసుకోవాలి. మా మధుర ఆడియో సాంగ్స్‌ను ఇతరుల మూవీస్‌లో ఉపయోగించుకుంటామని అడిగితే నేనెప్పుడు డబ్బులు ఛార్జ్ చేయలేదు. మిగతా ఆడియో కంపెనీస్ పెద్దఎత్తున ఛార్జ్ చేస్తుంటాయి. పాత పాటల్లో ఏ చిన్న బిట్ ఉపయోగించుకున్నా ఎన్‌వోసీ తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


