హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది, ఆయనల మనవాళ్లు కూడా ట్రై చేయొచ్చు.. నిర్మాత మధుర శ్రీధర్ కామెంట్స్
హీరోయిన్ చాందిని చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తు. మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ హీరోగా చేశాడు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా నిర్మించారు. నవంబర్ 14న సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సంతాన ప్రాప్తిరస్తు మూవీ హైలెట్స్ తెలిపారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.
-నేను, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పదేళ్లుగా కలిసి జర్నీ చేస్తున్నాం. నేను నిర్మించిన "లేడీస్ అండ్ జెంటిల్ మేన్" మూవీకి రైటర్‌గా పనిచేశాడు. ఆ సినిమాకు అప్పటి ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాల్లో తృతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ ఎడిటర్‌గా నవీన్ నూలికి అవార్డ్ వచ్చింది. నవీన్ నూలికి ఎడిటర్‌గా తొలి చిత్రమది.
-ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ దర్శకత్వంలో ఏబీసీడీ రూపొందించాం. సంజీవ్ అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఈ స్క్రిప్ట్‌ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మేము 50 రోజులు షూటింగ్ అనుకుంటే ఆల్‌మోస్ట్ అనుకున్నది అనుకున్నట్లే చిత్రీకరణ జరుపుతూ వెళ్లాడు.
-ఏ కారణంతోనూ సినిమా షూటింగ్ ఆలస్యం కాలేదు. వర్షం కారణంగా ఒకట్రెండు రోజులు షూటింగ్ ఆపాం. అలా మొత్తం 56 డేస్‌లో "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా షూటింగ్ పూర్తి చేశాం.
-"సంతాన ప్రాప్తిరస్తు" స్క్రిప్ట్‌ను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ అంశం వల్ల వాళ్ల ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందని మూవీ చేయలేదు.
-బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. మనవాళ్లు కూడా ఆయనలా ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత కొత్త అబ్బాయితో వెళ్దాం ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం.
-మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా మంచి ఆర్టిస్టులతో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా కావాలని ఇరికించినట్లు ఉండదు. చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఫన్ క్రియేట్ చేశాం.
-వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్.. ఇలా కాస్టింగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. స్క్రిప్ట్ వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. డైరెక్షన్ మొత్తం సంజీవ్ చూసుకున్నాడు.
-మంచి లవ్ స్టోరీ, ఎమోషన్ ఉన్న క్లీన్ ఎంటర్‌టైనింగ్ మూవీ మాది. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" అని నిర్మాత మధుర శ్రీధర్ తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


