ఏ బట్టల సత్తిగాడి మాటలు వినొద్దు.. మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి: శివాజీకి ప్రొడ్యూసర్ కౌంటర్
శివాజీ చేసిన కామెంట్స్ పై ఇప్పటికీ దుమారం రేగుతూనే ఉంది. సాధారణ అభిమానులే కాదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా అతనితో ఆడుకుంటున్నారు. తాజాగా ప్రొడ్యూపర్ ఎస్కేఎన్ కూడా గట్టి కౌంటర్ వేశాడు.
నటుడు శివాజీ హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతూ నోరు జారిన సంగతి తెలుసు కదా. ఇప్పటికీ అతని కామెంట్స్ పై డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతడు ఏమన్నాడో చూడండి.

శివాజీకి ఎస్కేఎన్ కౌంటర్
నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందించాడు. అక్కడే ఉన్న మూవీ హీరోయిన్ ను చూస్తూ.. “ఏంటి ఇలా మామూలు డ్రెస్ వేసుకొచ్చావ్.. కాస్త గ్లామరస్ గా రావచ్చు కదా. మీకు అమ్మాయిలు, హీరోయిన్లు ఏ డ్రెస్సు కంఫర్టబుల్, కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందో అవే వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినక్కర్లేదు. ఈ డ్రెస్సు వేసుకుంటే బాగుంటారు.. ఈ డ్రెస్సు వేసుకుంటే ఇదైపోతారు అనేది ఏమీ లేదు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం. మన ఉద్దేశం మంచిదైతే మంచి జరుగుతుంది తప్ప డ్రెస్సుల్లో ఉండదు” అని అతడు అనడం గమనార్హం.
మహిళా కమిషన్ ముందుకు శివాజీ
శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా (Suo moto) స్వీకరించడంతోపాటు వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ అతనికి నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, ఆవేశంలో దొర్లిన మాటలని ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తనపై ఎవరో కుట్ర పన్ని కావాలనే ఇలా చేస్తున్నారని తర్వాత అతడు మీడియాతో అనడం గమనార్హం.
వివాదం ముదరడంతో శివాజీ ఒక సెల్ఫీ వీడియోను గతంలో విడుదల చేశాడు. "నా ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు. హీరోయిన్లను జనం ఇబ్బంది పెడుతున్న వీడియోలు చూసి ఆవేదనతో అలా మాట్లాడాను. కానీ నేను వాడిన పదాలు తప్పు. అందుకు నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను" అని శివాజీ పేర్కొన్నాడు.
మొత్తానికి 'దండోరా' ఈవెంట్ కాస్తా శివాజీ మెడకు చుట్టుకుంది. సీనియర్ నటుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


