...
...
Next Story

ఆ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు కనిపించలేదు.. 1600 స్క్రీన్స్‌లో రిలీజ్.. కుబేర నిర్మాతల కామెంట్స్

నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ కలిసి నటించిన సినిమా కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాను నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. జూన్ 20 కుబేర రిలీజ్ సందర్భంగా రీసెంట్‌గా మూవీ విశేషాలను పంచుకున్నారు నిర్మాతలు.

Published on: Jun 15, 2025, 07:11:15 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు భారీ స్టార్స్‌తో తెరకెక్కిన సినిమా కుబేర. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించింది. దీంతో కుబేరపై భారీ అంచనాను నెలకొన్నాయి.

కుబేర నిర్మాతల కామెంట్స్

ఆ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు కనిపించలేదు.. 1600 స్క్రీన్స్‌లో రిలీజ్.. కుబేర నిర్మాతల కామెంట్స్
ఆ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు కనిపించలేదు.. 1600 స్క్రీన్స్‌లో రిలీజ్.. కుబేర నిర్మాతల కామెంట్స్

పాన్ ఇండియా స్థాయిలో కుబేర సినిమాను జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కుబేర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నాగార్జున పాత్ర, కుబేర సినీ విశేషాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

శేఖర్ కమ్ముల గారు ఫస్ట్ టైమ్ ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో సినిమా చేస్తున్నారు కదా? ఇది ఎంత డిఫరెంట్‌గా ఉండబోతుంది ?

-శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్‌తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్‌కి చాలా న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది.

-చాలా డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ కమ్ముల గారు స్టార్స్‌ని క్యారెక్టర్స్‌గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.

షూటింగ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు?

-రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్‌తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్‌లో తీసాము. బొంబాయిలో సినిమాని షూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని చిత్రీకరించడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.

-నాగార్జున గారితో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ గారికి ఈ పాత్ర కోసం నాగార్జున గారు తప్పితే మరొకరు కనిపించలేదు. నాగ్ సర్‌కి ఈ కథ నచ్చింది. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఆయన్ని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంత గొప్పగా పర్ఫార్మ్ చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks