Madhavan: నా వంటమనిషి జీతమెంతో చెప్పి నా కొడుకుని పెంచా.. అందరినీ గౌరవించాల్సిందే.. కృతజ్ఞతాభావం నేర్పించా: మాధవన్

Madhavan: మాధవన్ తన కొడుకు వేదాంత్ మాధవన్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. తాజాగా మరోసారి వేదాంత్ ను తాను ఎలా పెంచాడో మాధవన్ వివరించారు. తన ఇంట్లో పని చేసే వంట మనిషి జీతం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వెల్లడించారు.

Published on: Jul 9, 2026, 20:36:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Madhavan: చాక్లెట్ బాయ్ ఆర్ మాధవన్ తన కొడుకు వేదాంత్ మాధవన్ ను పెంచిన క్రేజీ పేరెంటింగ్ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కోట్లాది రూపాయల ఆస్తి, లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ తన కొడుకు ఎప్పుడూ చాలా సాధారణంగా ఉండేలా చూడటం కోసం తను ఇంట్లో ఎలాంటి కఠినమైన రూల్స్ ఫాలో అయ్యాడో మాధవన్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు.

Madhavan: నా వంటమనిషి జీతమెంతో చెప్పి నా కొడుకుని పెంచా.. అందరినీ గౌరవించాల్సిందే.. కృతజ్ఞతాభావం నేర్పించా: మాధవన్ (Instagram)
Madhavan: నా వంటమనిషి జీతమెంతో చెప్పి నా కొడుకుని పెంచా.. అందరినీ గౌరవించాల్సిందే.. కృతజ్ఞతాభావం నేర్పించా: మాధవన్ (Instagram)

చిన్నతనం నుంచే క్రమశిక్షణ

ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో రాధికా గుప్తాతో మాట్లాడిన మాధవన్.. తన కొడుకు వేదాంత్ ఎదుగుదల వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ బయటపెట్టాడు. వేదాంత్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ప్రతిభ ఉన్న కాంపిటీటివ్ స్విమ్మర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశం కోసం ఒలింపిక్ మెడల్ గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్న తన కొడుక్కి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, కృతజ్ఞతా భావం నేర్పించానని మాధవన్ చెప్పాడు.

వంటమనిషి జీతంతో రియాలిటీ చెక్

"మేము చాలా మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. కానీ దేవుడి దయ వల్ల నాకు మంచి సక్సెస్ రావడంతో వేదాంత్ అడిగినవన్నీ నేను కొనివ్వగలిగాను. అయితే దీనివల్ల వాడు లగ్జరీకి అలవాటు పడి పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాడికి ఒక రియాలిటీ చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాను" అని మాధవన్ తెలిపాడు.

"కొన్నిసార్లు నా ఇంట్లో పనిచేసే వంటమనిషి జీతం ఎంతో వేదాంత్ కి చెప్పేవాడిని. నీకు గిఫ్ట్ గా వచ్చిన ఈ బొమ్మ ఖరీదు ఎంతో తెలుసా.. ఈ వంటమనిషి ఒక రోజంతా ఆ వేడి కిచెన్ లో ఉంటూ.. ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే తప్ప ఇందులో సగం భాగం కూడా కొనలేడు అని వాడికి అర్ధమయ్యేలా చెప్పేవాడిని. ఆ మాటలు వేదాంత్ మైండ్ లో బలంగా నాటుకుపోయాయి" అని మాధవన్ ఎమోషనల్ అయ్యాడు.

లిఫ్ట్ మ్యాన్, డ్రైవర్లకు గౌరవం ఇవ్వాల్సిందే

డబ్బులు ఉన్నంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసి చూడకూడదనే రూల్ మాధవన్ ఇంట్లో కఠినంగా అమలు చేశాడు. ఇంట్లో ఉండే వాచ్ మెన్, లిఫ్ట్ మ్యాన్, డ్రైవర్లు, పనిమనుషులు ఎవరినైనా సరే క్యాజువల్ గా కాకుండా ఎంతో గౌరవంగా 'దీదీ', 'భయ్యా' అని పిలవాలని కొడుక్కి కండిషన్ పెట్టాడు. ఇది కేవలం మంచి అలవాటు మాత్రమే కాదని, మన చుట్టూ ఉన్న సమాజం పట్ల ఒక అవగాహన పెంచుకోవడానికి సాయపడుతుందని మాధవన్ నమ్ముతాడు.

వేదాంత్ మాధవన్ గురించి..

వేదాంత్ మాధవన్ ప్రస్తుతం ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ లో ఇండియా తరపున అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే మలేషియన్ ఓపెన్ లో ఐదుసార్లు గోల్డ్ మెడల్, డానిష్ ఓపెన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ కొట్టాడు. దాంతో పాటు లాట్వియన్ ఓపెన్, థాయిలాండ్ ఓపెన్ లలో బ్రాంజ్ మెడల్స్ సాధించి కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో ఐదో స్థానంలో నిలిచాడు. కొడుకును సెలబ్రిటీ కిడ్ లా కాకుండా ఒక అథ్లెట్ లా పెంచిన మాధవన్ పేరెంటింగ్ స్టైల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మాధవన్ కెరీర్ ఇలా..

ఇక మాధవన్ కెరీర్ విషయానికి వస్తే.. రీసెంట్ గా వచ్చిన విజువల్ వండర్ 'ధురంధర్' (Dhurandhar) సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అజయ్ సన్యాల్ గా మైండ్ బ్లాంక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర రూ. 3100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ లో మాధవన్ యాక్టింగ్ కు నేషనల్ వైడ్ గా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆయన చేతిలో జిడిఎన్ (GDN), అదృష్టశాలి (Adhirshtasaali), సర్కిల్ (Circle) లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More