నెట్‌ఫ్లిక్స్‌లో థ్రిల్లర్ మూవీ.. ఓ ఫ్యామిలీలో అందరి గొంతులు కోసి హత్య.. ఐదేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ ఎలా ఉందంటే?
నెట్‌ఫ్లిక్స్ లో ఐదేళ్ల కిందట వచ్చిన థ్రిల్లర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన అందరి గొంతులు కోసి హత్య చేస్తారు. అది చేసిందెవరు? అసలు ఏం జరిగింది అన్నది ఈ మూవీలో చూడొచ్చు.
ఐదేళ్ల కిందట వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై'కి సీక్వెల్‌గా వచ్చిన 'రాత్ అకేలీ హై 2: ది బన్సల్ మర్డర్స్' (Raat Akeli Hai 2) ఓటీటీలో విడుదలైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి పోలీస్ ఆఫీసర్ జటిల్ యాదవ్‌గా మెప్పించాడు. బన్సల్ కుటుంబం మొత్తాన్ని ఒకే రాత్రి గొంతు కోసి చంపటం, ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు ఈ సినిమా కథాంశం.

రాత్ అకేలీ హై 2 స్టోరీ ఇదే..
దర్శకుడు హనీ ట్రెహాన్ దర్శకత్వంలో, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై 2'. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉందో తెలుసుకోండి.
ఇది బన్సల్ అనే సంపన్న కుటుంబం కథ. ఒకరోజు రాత్రి ఆ కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురవుతుంది. అందరి గొంతులు కోసి చంపేస్తారు. ఒకవైపు కాకుల గుంపు చనిపోయి పడి ఉండటం, మరోవైపు మనుషుల హత్యలు జరగడం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కేసులో డ్రగ్స్‌కు బానిసైన కొడుకు, ఒక లేడీ బాబా (దీప్తి నావల్), ఆస్తి కోసం చూసే బంధువు (సంజయ్ కపూర్) ప్రధాన అనుమానితులుగా ఉంటారు.
ఈ కేసును ఛేదించడానికి ఇన్స్‌పెక్టర్ జటిల్ యాదవ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) రంగంలోకి దిగుతాడు. అసలు హంతకుడు ఎవరు? ఈ మిస్టరీని జటిల్ ఎలా విడదీశాడు అనేది మిగతా కథ.
రాత్ అకేలీ హై ఎలా ఉందంటే?
ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫోరెన్సిక్ టీమ్ సీన్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చాలా సహజంగా, భయపెట్టేలా ఉంటాయి. ఇది సీక్వెల్ అయినప్పటికీ మొదటి పార్ట్ కథతో సంబంధం లేదు. కొత్త కథ కాబట్టి ఎవరైనా చూడొచ్చు. క్లైమాక్స్ ట్విస్టులు, చిక్కుముడులు విప్పిన విధానం బాగుంది.
అయితే కథలో చాలా పాత్రలు ఉండటం వల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. దీప్తి నావల్ ట్రాక్ కథనంలో వేగాన్ని తగ్గించింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడానికి పెట్టిన కొన్ని సన్నివేశాలు అంతగా వర్కవుట్ అవ్వలేదు.
నటీనటుల పనితీరు
నవాజుద్దీన్ సిద్ధిఖీ.. జటిల్ యాదవ్ పాత్రలో జీవించేశాడు. పర్సనల్ లైఫ్ సీన్స్ లో అతని నటన అద్భుతం. ఇక రాధికా ఆప్టే ఇందులో రాధగా గెస్ట్ రోల్ చేసినా.. నవాజ్‌తో ఆమె కెమిస్ట్రీ అదిరిపోయింది. రేవతి (ఫోరెన్సిక్ హెడ్), సంజయ్ కపూర్, రజత్ కపూర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. చిత్రాంగద సింగ్ ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది.
చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. 'రాత్ అకేలీ హై 2' ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. డార్క్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. నటీనటుల బలం, మంచి క్లైమాక్స్ ఈ సినిమాను సేవ్ చేశాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


