Radhika Sarathkumar: తల్లి ఇక లేదన్న గుండె పగిలే వార్త విన్నా నవ్వులు పూయించింది.. రాధిక డెడికేషన్ చూసి సూర్య ఎమోషనల్
Radhika Sarathkumar: టాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సినిమా పట్ల ఎంత డెడికేషన్ తో ఉంటారో తాజాగా ఘటన నిరూపిస్తోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ షూటింగ్ సమయంలో తన తల్లి చనిపోయిన విషయం తెలిసినా ఆమె ఆగకుండా షూటింగ్ చేసిన తీరు గురించి తాజాగా బయటపడింది.
Radhika Sarathkumar: తల్లి కన్నుమూశారనే గుండెకోత వార్త తెలిసిన కొన్ని నిమిషాల్లోనే, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సెట్‌లో కామెడీ సీన్ షూటింగ్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వర్సటైల్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రమోషనల్ షూట్‌లో ఈ దిగ్భ్రాంతికర సంఘటన బయటపడింది. సినిమా పట్ల ఆమెకున్న అంకితభావం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు సైతం హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు.

తల్లి చనిపోయినా ఆపని షూటింగ్.. డైరెక్టర్ వెంకీ అట్లూరి షాక్
ఈ షాకింగ్ సంఘటన గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల ఓ ప్రమోషనల్ వీడియోలో రివీల్ చేశారు. "మేము సెట్‌లో ఫుల్ కామెడీ సీన్ షూట్ చేస్తున్నాం. సరిగ్గా అదే టైమ్‌లో రాధికా మేడమ్ మదర్ గీతా రాధ గారు చనిపోయారనే బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ వార్త వినగానే నేను పూర్తిగా బ్లాంక్ అయిపోయాను. కానీ ఆమె మాత్రం మిగిలిన షాట్స్ పూర్తి చేసేసి వెళ్తాను అని అడిగారు" అంటూ వెంకీ ఆనాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సంఘటనపై రాధికా శరత్‌కుమార్ స్పందిస్తూ ప్రొఫెషనలిజమ్ ప్రాధాన్యతను వివరించారు. "ఆ సీన్ 85 శాతం పూర్తయింది. కేవలం ఐదు షాట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సీన్‌ని మళ్లీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం. నా తల్లి హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడే నేను షూటింగ్‌కి వచ్చాను. నువ్వు వెళ్లి షూటింగ్ పూర్తి చేయి అని ఆమే నాతో చెప్పారు" అని రాధికా తెలిపారు.
కన్నీళ్లు పెట్టుకున్న మమితా బైజు.. సూర్య హాట్ కామెంట్స్
ఈ సీన్ ని కళ్లారా చూసిన యంగ్ హీరోయిన్ మమితా బైజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. షూటింగ్ ముందు రోజే రాధికా తన తల్లితో ఉన్న అనుబంధం గురించి చెప్పారని, అంతలోనే ఈ విషాదం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని మమితా ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి చనిపోయిన బాధ మనసులో ఉన్నా కెమెరా ముందుకు రాగానే నవ్వులు పూయిస్తూ సీన్ చేసిన విధానం చూసి మాటలు రాలేదని చెప్పారు.
ఇక వర్సటైల్ స్టార్ సూర్య.. రాధికా డెడికేషన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఆమె తన కళకు ఇస్తున్న గౌరవం ఎలాంటిదో ఈ ఒక్క సంఘటన చెప్తుంది. ఇన్నేళ్ల పాటు లెజెండరీ కెరీర్‌ని కొనసాగించారంటే దానికి కారణం సినిమాపై ఆమెకున్న ప్రేమే. సినిమా రంగానికి, తన వృత్తికి ఆమె ఇచ్చే రెస్పెక్ట్ అనితరసాధ్యం" అని సూర్య కొనియాడారు.
ఆగస్టు 14న థియేటర్లలోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'
రాధికా శరత్‌కుమార్ తల్లి గీతా రాధ సీనియర్ నటుడు ఎం.ఆర్. రాధ భార్య. సెప్టెంబర్ 2025లో చెన్నైలోని తన నివాసంలో వయోభారంతో ఆమె కన్నుమూశారు. ఈ మధ్యనే లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మరణించినప్పుడు కూడా రాధికా చాలా ఎమోషనల్ అయ్యారు. తన జీవితాన్ని తీర్చిదిద్దింది ఇద్దరే అని, ఒకరు తన తల్లి కాగా ఇంకొకరు గురువు భారతీరాజా అని రాధికా గుర్తుచేసుకున్నారు.
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య 40 ఏళ్ల సంజయ్ విశ్వనాథ్ అనే ఒలింపిక్ షూటర్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ విశేషాలు
* సినిమా పేరు : విశ్వనాథ్ అండ్ సన్స్
* ప్రధాన తారాగణం : సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్
* దర్శకత్వం : వెంకీ అట్లూరి (Venky Atluri)
* సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)
* నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
* విడుదల తేదీ : 14 ఆగస్టు 2026
* భాషలు : తెలుగు, తమిళం
* జానర్ : ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


