యూట్యూబ్‌లో రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ రికార్డుల మోత.. తెలుగులో అరుదైన మైల్‌స్టోన్

యూట్యూబ్‌లో రామ్ చరణ్ పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా తెలుగులో 100 మిలియన్ల వ్యూస్ రికార్డు అందుకోవడం విశేషం. ఇక ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Published on: Dec 16, 2025, 16:26:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్‌లో సంచలనాల పరంపర కొనసాగిస్తోంది. గత నెల 7వ తేదీన ఈ పాటను మేకర్స్ రిలీజ్ చేయగా.. 40 రోజుల్లోనే అరుదైన 100 మిలియన్ల మార్క్ అందుకోవడం విశేషం. తెలుగులో ఆల్ టైమ్ బెస్ట్ చార్ట్‌బస్టర్ గా రికార్డు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది.

యూట్యూబ్‌లో రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ రికార్డుల మోత.. తెలుగులో అరుదైన మైల్‌స్టోన్
యూట్యూబ్‌లో రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ రికార్డుల మోత.. తెలుగులో అరుదైన మైల్‌స్టోన్

చికిరి చికిరి సాంగ్ రికార్డు

బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ చికిరి చికిరి. ఈ పాట తాజాగా యూట్యూబ్ లో ఒకేసారి రెండు అరుదైన రికార్డులను అందుకుంది. కేవలం తెలుగులో 100 మిలియన్లు, అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల వ్యూస్ నమోదు చేయడం విశేషం. ఈ విషయాన్ని ఆ మూవీ టీమ్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

“చికిరి చికిరికి సెంచరీ. ఈ ప్రేమకు రుణపడి ఉంటాం. తెలుగులో 100 మిలియన్ ప్లస్, మొత్తం 5 భాషల్లో కలిపి 150 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటను సీజన్ ఆంథమ్ గా మార్చినందుకు థ్యాంక్యూ. రీల్స్ ఇంకా రావాలి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

చికిరి చికిరి సాంగ్ లిరిక్స్ ఇవే..

పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ మ్యాజిక్ చేస్తోంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్ కాగా.. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చికిరి సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడాడు. బాలాజి సాహిత్యం అందించాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ చికిరి సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.

ఓ హో.. ల లా లా లాల..

ల ల లా లా లా ..

ఓ హో.. ల లా లా లాల..

ల ల లా లా లా ..

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంత ఆడిందే తైతక్కా…

దీనందాలో లెక్క

దీనేషాలో తిక్క

నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక

చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..

చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

ఆ ముక్కు పై పెట్టి కోపం

తొక్కేసావే ముక్కెరందం

చింతాకులా.. ఉందే పాదం

చిర్రాకులే నడిచే వాటం..

ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు

నీ మత్తే తాగిందా తాటికల్లు..

కూసింతే చూత్తే నీలో వగలు

రాసేత్తారుగా ఎకరాలు

నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు

హో చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

దీనందాలో లెక్క

దీనేషాలో తిక్క

నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

తందనాననా తర్ రంధనాననా

తర్ రంధనాననా తర్ రంధనానా..

తందనాననా తర్ రంధనాననా

తర్ రంధనాననా నా నా నా నా…

నచ్చేసావే మల్లెగంప..

నీ అందాలే నాలో దింప

ఏం తిన్నావో.. కాయ దుంప

నీ యవ్వారం వరద ముంప

నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి

లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..

నీ సింగారాన్ని సూత్తావుంటే సొంగకార్చుకుందే

గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే చెయ్యలేసే..

చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

దీనందాలో లెక్క

దీనేషాలో తిక్క

నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి

చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

సరుకు సామాను సూసి మీసం లేచి వేసే కేక

చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More