Ram Charan Popcorn: థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లు తగ్గాలన్న రామ్ చరణ్.. ఇటు ప్రశంసలు, అటు విమర్శలు.. కారణమేంటంటే?
Ram Charan Popcorn: రామ్ చరణ్ తాజాగా థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేశంలో ఇప్పటికీ సినిమానే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటూనే థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లు కాస్త తగ్గితే బాగుంటుందని అనడం విశేషం.
Ram Charan Popcorn: థియేటర్లలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అమ్ముతున్న స్నాక్స్, కూల్ డ్రింక్స్ రేట్లపై సామాన్య ప్రేక్షకులు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. టికెట్ ధర కంటే లోపల దొరికే తినుబండారాల ధరలే ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సామాన్య ఆడియన్స్ పడుతున్న ఈ ఇబ్బందిని ఒక ప్రతిష్టాత్మక నేషనల్ స్టేజ్ పై ఓపెన్ గా ప్రస్తావించడం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం బుల్లితెర, వెండితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆ రేట్లు కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటుంది..
గ్లోబల్ స్టేజ్ పై ఇండియా సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని చర్చిస్తూ.. "గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్" (Great Power India: Nation First) అనే కాన్సెప్ట్ తో నిర్వహించిన 'రిపబ్లిక్ సమ్మిట్ 2026' (Republic Summit 2026) లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో భారతీయ సినిమా భవిష్యత్తు, సామాన్యులకు వినోదం గురించి రామ్ చరణ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
"మన దేశంలో ఇప్పటికీ సామాన్యులకు దొరికే అతి తక్కువ ఖర్చుతో కూడిన ఏకైక వినోదం సినిమా మాత్రమే. కుటుంబం మొత్తాన్ని థియేటర్ కి తీసుకెళ్లి, సినిమా చూసి, ఆ తర్వాత ఇంటికొచ్చి ఆ కథ గురించి మాట్లాడుకోవడం అనేది మన దేశంలో ఒక అద్భుతమైన కమ్యూనల్ యాక్టివిటీ. అయితే.. థియేటర్లలో ఆ పాప్‌కార్న్ రేట్లు కనుక కాస్త తగ్గిస్తే ఆడియన్స్ కు ఇంకా చాలా బాగుంటుంది" అంటూ చరణ్ నవ్వుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సమస్యను గుర్తించిన మెగా పవర్ స్టార్..
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర తన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల వేటలో ఉన్న రామ్ చరణ్.. థియేటర్ల మనుగడకు సంబంధించిన ఇంతటి ముఖ్యమైన విషయాన్ని మాట్లాడటం నిజంగా అభినందనీయం. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేక్షకులు కేవలం థియేటర్లలో దొరికే స్నాక్స్, పాప్‌కార్న్ రేట్లు భరించలేక మల్టీప్లెక్స్‌లకు వెళ్లడం మానేసి.. సినిమాలు ఓటీటీల్లోకి వచ్చే వరకు ఓపికగా వెయిట్ చేస్తున్నారు. కుటుంబం మొత్తంతో వెళ్తే టికెట్ల కంటే ఇంటర్వెల్ లో అయ్యే ఖర్చే నిర్మాతలకు, ప్రేక్షకులకు పెద్ద భారంగా మారుతోంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న స్టార్ హీరో.. కామన్ ఆడియన్స్ పల్స్ ను పట్టుకుని నేషనల్ సమ్మిట్ లో ఈ సమస్యను రైజ్ చేయడం విశేషం. చరణ్ చేసిన ఈ ప్రాక్టికల్ కామెంట్స్ పై నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. "కనీసం ఇప్పటికైనా మల్టీప్లెక్స్ అసోసియేషన్స్ వాళ్లు రామ్ చరణ్ మాటలు విని ఆ ధరలను కాస్త తగ్గిస్తారేమో చూడాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అదే సమయంలో మీ రెమ్యునరేషన్ల సంగతేంటని కూడా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిని పెంచుకుంటూ పోవడం వల్ల సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతోందన్న విమర్శల నేపథ్యంలో.. పాప్‌కార్న్ రేట్ల సంగతి బాగానే ఉన్నా వీటిపైనా దృష్టి సారించాలంటూ కొందరు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


