Kangana Ranaut: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ వివాదం: జాన్వీ కపూర్ సీన్లపై కంగనా రనౌత్ సంచలన కామెంట్స్
Kangana Ranaut: పెద్ది మూవీలో జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై వస్తున్న విమర్శలపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. హీరోయిన్లు ఇలాంటి వాటిపై నోరు విప్పాలని ఆమె స్పష్టం చేశారు.
Kangana Ranaut: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' క్యారెక్టర్‌ను ప్రెజెంట్ చేసిన విధానంపై ఆడియన్స్ నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

కేవలం గ్లామర్ కోసమే ఫీమేల్ క్యారెక్టర్లను వాడుకోవడం, హీరోయిన్ ఇష్టానికి వ్యతిరేకంగా రొమాంటిక్ సీన్స్ పెట్టడంపై ఇప్పుడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా రియాక్ట్ అయ్యారు.
సోషల్ మీడియాలో అసలు వివాదం ఏంటి?
'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ అందాన్ని హైలైట్ చేసే క్రమంలో కెమెరా యాంగిల్స్ కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు హీరో రామ్ చరణ్ క్యారెక్టర్ పదే పదే అచ్చియమ్మ వెంటపడటం, కరెంట్ పోయిన టైమ్‌లో ఆమెకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకునే సీన్ పెద్ది వివాదానికి ప్రధాన కారణంగా మారింది. విలన్ చేస్తే వేధింపులు, అదే హీరో చేస్తే రొమాన్స్ ఎలా అవుతుందని నెటిజన్లు నిలదీస్తున్నారు. ముమ్మాటికీ ఇది దాడి కిందకే వస్తుందని, ఇలాంటి సీన్స్ వల్ల సొసైటీకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని మండిపడుతున్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు
ఈ వివాదం పెద్దది కావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు సానా శనివారం (జూన్ 6) ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఆడియన్స్ హర్ట్ అయినందుకు ఆయన సారీ చెప్పారు. "సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే లేదా గౌరవానికి భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి" అని ఆయన వివరణ ఇచ్చారు. బుచ్చిబాబు సారీ చెప్పినప్పటికీ, టాలీవుడ్‌లో ఉమెన్ క్యారెక్టరైజేషన్‌పై డిబేట్ మాత్రం ఆగట్లేదు.
నటీమణులు నోరు విప్పాలి: కంగనా రనౌత్
తన కొత్త సినిమా 'భారత్ భాగ్య విధాత' ప్రమోషన్స్‌లో ఉన్న కంగనా రనౌత్ ఈ ఇష్యూపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో ఫీమేల్ యాక్టర్లను కేవలం ఒక వస్తువులా చూపించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె నటీమణులకు ఒక సలహా ఇచ్చారు. "స్క్రిప్ట్ వినేటప్పుడు లేదా షూటింగ్ టైమ్‌లో ఏదైనా సీన్ ఇబ్బందిగా అనిపిస్తే హీరోయిన్లు కచ్చితంగా నోరు విప్పాలి. ఆ సీన్ చూసేటప్పుడు తప్పుగా అనిపిస్తోందని మేకర్స్‌కు స్ట్రెయిట్‌గా చెప్పాలి" అని కంగనా అన్నారు.
సినిమా అనేది అందరి కృషి
చాలాసార్లు మేల్ రైటర్స్ కథలు రాసేటప్పుడు ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అవుతారని కంగనా అభిప్రాయపడ్డారు. "డైరెక్టర్లు కావాలని అలా చేయకపోవచ్చు. కానీ మగవాళ్లు కలిసి స్టోరీ రాసుకునేటప్పుడు వాళ్లకు అందులో తప్పు కనిపించదు. అదే ఒక మహిళగా మన ఫీలింగ్స్ చెప్తే వాళ్లు కచ్చితంగా అర్థం చేసుకుంటారు. సినిమా అనేది ఒక సమష్టి కృషి. మన అభ్యంతరాలు చెప్తే ఏ డైరెక్టర్ అయినా వింటారు" అని కంగనా క్లారిటీ ఇచ్చారు. జూన్ 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న తన 'భారత్ భాగ్య విధాత' సినిమాలో కంగనా ఒక నర్స్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న 1: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వివాదానికి అసలు కారణం ఏంటి?
జవాబు: ఈ మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్‌ను అతిగా గ్లామరైజ్ చేయడం, ఆమె సమ్మతి లేకుండా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకునే సీన్ ఉండటమే ఈ వివాదానికి మెయిన్ రీజన్.
ప్రశ్న 2: ఈ వివాదంపై డైరెక్టర్ బుచ్చిబాబు ఏమన్నారు?
జవాబు: సినిమా ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని చెప్తూ, ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయన అఫీషియల్‌గా క్షమాపణలు చెప్పారు.
ప్రశ్న 3: కంగనా రనౌత్ హీరోయిన్లకు ఇచ్చిన సలహా ఏంటి?
జవాబు: షూటింగ్‌లో ఏదైనా సీన్ అభ్యంతరకరంగా అనిపిస్తే హీరోయిన్లు సైలెంట్‌గా ఉండకూడదని, డైరెక్టర్‌తో ధైర్యంగా తమ అభ్యంతరాలను చెప్పాలని సూచించారు.
ప్రశ్న 4: కంగనా రనౌత్ కొత్త సినిమా 'భారత్ భాగ్య విధాత' ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
జవాబు: కంగనా లీడ్ రోల్ చేసిన ఈ మూవీ జూన్ 12న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


