Jagapathi Babu: జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేయొద్దు.. పెద్ది కోసం ప్రాణం పెట్టాను.. గుర్తింపు కోరే హక్కు నాకుంది: జగపతి బాబు

Jagapathi Babu: జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ నటనను ట్రోల్ చేస్తున్న వారికి అలా చేయొద్దని చెబుతూనే.. తన అప్పలసూరి పాత్రకు మాత్రం సరైన గుర్తింపు దక్కలేదని వాపోయారు.

Published on: Jun 8, 2026, 14:37:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jagapathi Babu: రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.236 కోట్లు వసూలు చేసి వరల్డ్ వైడ్‌గా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో పెద్ది పబ్లిక్ టాక్ మాత్రం హీరోయిన్ జాన్వీ కపూర్‌కు కొంత ప్రతికూలంగా ఉంది.

Jagapathi Babu: జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేయొద్దు.. పెద్ది కోసం ప్రాణం పెట్టాను.. గుర్తింపు కోరే హక్కు నాకుంది: జగపతి బాబు
Jagapathi Babu: జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేయొద్దు.. పెద్ది కోసం ప్రాణం పెట్టాను.. గుర్తింపు కోరే హక్కు నాకుంది: జగపతి బాబు

పెద్ది సినిమాలో ఆమె నటన, క్యారెక్టరైజేషన్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. పెద్ది హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే, ఒక నటిని ఇలా పర్సనల్‌గా టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ట్రోలింగ్‌పై సినిమాలో 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. జాన్వీ కపూర్‌ను ఎవరూ ట్రోల్ చేయొద్దని ఆయన ఆడియన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు పెద్ది సినిమాలో తన క్యారెక్టర్‌కు కూడా తగినంత గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జాన్వీ డైరెక్టర్ చెప్పిందే చేసింది.. ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు!

సాధారణంగా నెటిజన్లు ఒక క్యారెక్టర్ వర్కౌట్ కాకపోతే.. డైరెక్టర్ విజన్‌ను పక్కనపెట్టి ఆర్టిస్ట్‌ను తిడుతుంటారు. జాన్వీ కపూర్ విషయంలో కూడా ఇదే జరిగిందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు.

"సినిమా రిజల్ట్ గురించి ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి డైరెక్టర్ ఏం చెప్తే అదే చేసింది. ఒక్కోసారి డైరెక్టర్ విజన్ తెరపైకి వచ్చేసరికి మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీ కపూర్‌కు వంద శాతం సపోర్ట్ ఇస్తాను. ఆమెను పర్సనల్‌గా టార్గెట్ చేసి, సోషల్ మీడియాలో మెంటల్‌గా ఇబ్బంది పెట్టొద్దు" అని జగపతి బాబు కోరారు. ఒక యాక్టర్‌గా డైరెక్టర్ చేతిలో కీలుబొమ్మలా మారడం తప్ప హీరోయిన్ చేతిలో ఏమీ ఉండదనే వాస్తవాన్ని ఆయన గుర్తుచేశారు.

నా ప్రాణం పెట్టి చేశాను.. వాళ్లకైతే 20 సినిమాలు ఇచ్చేవారు

జగపతి బాబు 'పెద్ది' సినిమాలో తన క్యారెక్టర్ గురించి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టి పనిచేశానని, మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా పెద్ది రిలీజ్ కోసమే వెయిట్ చేశానని ఆయన చెప్పారు.

"సినిమా రిలీజ్ అయ్యాక ఒక పెద్ద డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. సినిమాలో నా పాత్ర అంత గొప్పగా ఉన్నా జనాలు ఎందుకు గుర్తించట్లేదు అని అడిగారు. అదే వేరే ఇండస్ట్రీకి చెందిన నటుడు ఈ క్యారెక్టర్ చేసి ఉంటే, వాళ్లను ఆకాశానికెత్తేసి వెంటనే 20 సినిమాలు ఆఫర్ చేసేవాళ్లు అని ఆయన నాతో అన్నారు" అని జగపతి బాబు అసహనం వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో పరభాషా నటులకు ఇచ్చే గౌరవం మన వాళ్లకు ఇవ్వరనే పాయింట్‌ను ఆయన ఇన్‌డైరెక్ట్‌గా టచ్ చేశారు. తాను కన్నడలో నటించినప్పుడు అక్కడ చాలా గౌరవం దక్కుతుందన్నారు.

బుచ్చిబాబును అడిగే హక్కు నాకుంది..

షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు సెట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారని, కానీ ఇప్పుడు ఎవరూ తన గురించి మాట్లాడకపోవడం బాధగా ఉందని ఆయన చెప్పారు. ఇదే విషయంపై డైరెక్టర్ బుచ్చిబాబును కూడా ప్రశ్నించానని తెలిపారు.

"ఈ సినిమా కోసం నా వంద శాతం ఇచ్చాను కాబట్టే గుర్తింపు అడిగే హక్కు నాకు ఉంది. వేరే ఏ సినిమాకూ నేను ఇలా అడగలేదు. పెద్ది సినిమాకు ఇంకా ఆదరణ దక్కుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతారు" అని జగపతి బాబు ధీమా వ్యక్తం చేశారు. రూ.300 కోట్లు పెట్టి సినిమా తీసినా, రూ.300 పెట్టి టికెట్ కొనే ఆడియన్స్ చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న టైమ్‌లో.. ఇలాంటి వివాదాలు సినిమా చుట్టూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు రికార్డ్ కలెక్షన్స్, మరోవైపు నటీనటులపై ట్రోల్స్... ఇవన్నీ పెద్ది సినిమాను ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంచుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More