...
...
Next Story

బుచ్చిబాబు టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడు.. జాన్వీ అతన్ని తన చేతులతో నలిపేయగలదు.. సరస్వతీ పుత్రుడు: రామ్ చరణ్

Ram Charan on Buchibabu: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానాపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు వచ్చే కొన్నేళ్లలో టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడని అనడం విశేషం. అతని బక్క పలచని శరీరం గురించి కూడా ఫన్నీ కామెంట్స్ చేశాడు.

Published on: May 30, 2026, 08:19:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ram Charan on Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.

బుచ్చిబాబు టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడు.. జాన్వీ అతన్ని తన చేతులతో నలిపేయగలదు.. సరస్వతీ పుత్రుడు: రామ్ చరణ్
బుచ్చిబాబు టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడు.. జాన్వీ అతన్ని తన చేతులతో నలిపేయగలదు.. సరస్వతీ పుత్రుడు: రామ్ చరణ్

రాబోయే రోజుల్లో బుచ్చిబాబు టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే టాప్ దర్శకుడిగా ఎదుగుతాడని చరణ్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

"బుచ్చిబాబు ఒక సరస్వతీ పుత్రుడు"

ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ప్రతిభ గురించి రామ్ చరణ్ చాలా ఆసక్తికరంగా, కాస్త సరదాగా మాట్లాడారు.

"తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. రూ.100 కోట్లు రాబట్టాడు. నా మాటలు రాసి పెట్టుకోండి.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే బుచ్చిబాబు ఇండియాలోనే టాప్ 4 దర్శకులలో ఒకడిగా నిలుస్తాడు. ఆయన చూస్తే కేవలం 55 నుండి 60 కేజీల బరువు మాత్రమే ఉంటాడు. నిజం చెప్పాలంటే.. జాన్వీ కపూర్ తన చేతులతోనే అతడిని నలిపేయగలదు (నవ్వుతూ). కానీ బుచ్చిబాబుకు ఏనుగంత మైండ్ ఉంది. ప్రస్తుతం మనకున్న దర్శకులలో ఆయన అత్యంత ప్రతిభావంతుడైన 'సరస్వతీ పుత్రుడు'. అతనికి నా ఆల్ ది బెస్ట్" అని రామ్ చరణ్ అన్నారు.

బుచ్చిబాబు విషయంలో మొదటి నుంచీ రామ్ చరణ్ ఆసక్తిగానే చెబుతూ వస్తున్నారు. అతని టాలెంట్ ను ఆకాశానికెత్తుతున్నారు. ఉప్పెనతో సంచలన విజయం అందుకున్న బుచ్చిబాబు.. రెండో సినిమానే రామ్ చరణ్ లాంటి నటుడితో, పాన్ ఇండియా స్థాయి మూవీ రూపొందించడం విశేషం.

పెద్ది మూవీ విశేషాలు

1. ఇంటర్వ్యూలో బుచ్చిబాబు గురించి రామ్ చరణ్ ఏమని ప్రశంసించారు?

బుచ్చిబాబు కేవలం 55-60 కేజీల బరువున్నా, అతనికి ఏనుగంత మైండ్ ఉందని.. రాబోయే కొన్నేళ్లలో దేశంలోని టాప్ 4 డైరెక్టర్లలో ఒకడిగా నిలుస్తాడని రామ్ చరణ్ కొనియాడారు. అంతేకాకుండా అతడిని 'సరస్వతీ పుత్రుడు' అని అభివర్ణించారు.

2. ‘పెద్ది’ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

3. 'పెద్ది' సినిమా థియేటర్లలోకి ఎప్పుడు రానుంది?

ఈ భారీ పాన్-ఇండియా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe