Ram Charan: రాసి పెట్టుకోండి.. పెద్ది ఓ బెస్ట్ మూవీ అవుతుంది.. అతడు లేకపోతే ఈ సినిమా లేదు: రామ్ చరణ్
Ram Charan: "పెద్ది సినిమా రాసిపెట్టుకోండి.. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది" అంటూ బెంగళూరు ప్రెస్ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Ram Charan: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పెద్ది' సినిమా గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా వేదికలపై ఈ చిత్రం పేరు మారుమోగుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ బెంగళూరులో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాపై చేసిన కామెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆయన మాటలు సినిమా రేంజ్‌ను, అంచనాలను అమాంతం పెంచేశాయి.
బెస్ట్ మూవీ అవుతుంది
"పెద్ది సినిమా రాసిపెట్టుకోండి, కచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది" అని బెంగళూరు ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ ఎంతో నమ్మకంగా చెప్పారు. పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ కానుండటంతో మూవీ టీమ్ దేశం మొత్తం తిరుగుతుంది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్, తర్వాత భోపాల్ లో ఓ భారీ కాన్సర్ట్, ఇప్పుడు బెంగళూరులో కన్నడ వెర్షన్ ప్రమోషన్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ పైనా చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయనతో కలిసి నటించడంతో తన జన్మ ధన్యమైపోయిందని చెప్పాడు. తనకు కన్నడ సరిగా రాదని, వచ్చేసారి పూర్తిగా నేర్చుకొని వస్తానని చెప్పడం విశేషం.
బుచ్చిపై ప్రశంసలు
డైరెక్టర్ బుచ్చిబాబు లేకపోతే ఈ పెద్ది సినిమా లేదని ఈ సందర్భంగా చరణ్ అన్నాడు. అంతేకాదు అసలు ఈ సినిమా వైపు అడుగు పడటానికి కారణమైన డైరెక్టర్ సుకుమార్ కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఈ మూవీలో నటించిన జాన్వీ కపూర్, జగపతి బాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నిర్మాత సతీష్ లకు కూడా చరణ్ థ్యాంక్స్ చెప్పాడు.
కన్నడ నాట రామ్ చరణ్ ఇచ్చిన ఈ స్పీచ్ వైరల్ అవుతోంది. అక్కడి అభిమానులు చరణ్ మాట్లాడుతున్నంత సేపూ కేరింతలు కొడుతూనే ఉన్నారు. వాళ్లలో ఓ చిన్నారి అభిమాని ఉండటం చూసి చరణ్ ప్రత్యేకంగా అతన్ని తన దగ్గరికి పిలిపించుకోవడం విశేషం.
ఇక ఈ పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో #GetReadyForPeddi అనే హ్యాష్ ట్యాగ్ జోరుగా ట్రెండ్ అవుతోంది. అభిమానులు ఈ ట్యాగ్‌తో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే అభిమానుల కోసం ఓ వాట్సాప్ కమ్యూనిటీ లింక్‌ను కూడా మేకర్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం ద్వారా చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ వివరాలను నేరుగా మొబైల్‌లో పొందవచ్చు. మొత్తానికి రామ్ చరణ్ ఒక్క మాటతో 'పెద్ది' సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ చేశారు. ఇక జూన్ 4న థియేటర్లలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
పెద్ది సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
పెద్ది సినిమాపై రామ్ చరణ్ ఏమని కామెంట్ చేశారు?
"పెద్ది సినిమా రాసిపెట్టుకోండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది" అని బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పారు.
పెద్ది సినిమా బెంగళూరు ప్రెస్ మీట్ ఈవెంట్‌ను ఎవరు నిర్వహించారు?
ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ శ్రేయాస్ గ్రూప్ ఈ ప్రెస్ మీట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


