Ram Charan Janmashtami: తమ చిన్ని రాధాకృష్ణులతో రామ్ చరణ్, ఉపాసన జన్మాష్టమి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

Ram Charan Janmashtami: రామ్ చరణ్ ఇంట జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చరణ్,  ఉపాసన దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫొటోను ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉపాసన షేర్ చేశారు.

Published on: Sep 4, 2026, 13:50:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Janmashtami: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. తమ ముగ్గురు పిల్లలతో కలిసి చరణ్-ఉపాసన దంపతులు ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో ఈ పూజలు నిర్వహించారు.

Ram Charan Janmashtami: తమ చిన్ని రాధాకృష్ణులతో రామ్ చరణ్,  ఉపాసన జన్మాష్టమి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్
Ram Charan Janmashtami: తమ చిన్ని రాధాకృష్ణులతో రామ్ చరణ్, ఉపాసన జన్మాష్టమి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

ఈ వేడుకల్లో బుల్లి పిల్లలను శ్రీకృష్ణుడు, రాధారాణి గెటప్పుల్లో అలంకరించడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లోని దేవుడి మందిరంలో సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు భక్తిపారవశ్యంలో మునిగిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

క్లిన్ కారాతో పాటు ట్విన్స్ శివ రామ్, అన్వీర.. నెట్టింట సందడి

తమ ఇంట్లో పిల్లలతో కలిసి పూజ చేస్తున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. “కల నిజమైంది.. ఆనందంగా ఉంది.. ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే క్యాప్షన్ తో ఉపాసన ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మొదటి సంతానంగా కుమార్తె క్లిన్ కారా (Klim Kaara) జన్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాప కాగా.. వారికి శివ రామ్ (Shiva Ram), అన్వీర (Anveera) అని పేర్లు పెట్టారు.

సినిమా షూటింగ్‌లు, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ చరణ్ తన ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. ముగ్గురు పిల్లల రాకతో చిరంజీవి ఇంట పండగ కళ రెట్టింపైందని, బుల్లి కృష్ణుడి రూపంలో మెగా వారసుడు ఇంట్లో సందడి చేయడం చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూనే క్యూట్ మూమెంట్స్ షేర్

పిల్లల ప్రైవసీ విషయంలో రామ్ చరణ్, ఉపాసన చాలా కేర్ తీసుకుంటారు. మొదటి నుంచి క్లిన్ కారా ముఖం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్టే, ఇప్పుడు కవల పిల్లల విషయాల్లోనూ ప్రైవసీ మెయింటెన్ చేస్తున్నారు.

అయితే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కొత్త తరం పిల్లల రాకతో అటు మెగా కాంపౌండ్‌లోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపస్తోంది.

ఒకవైపు సినిమాలు.. మరోవైపు ప్రొడక్షన్, ఫ్యామిలీ బ్యాలెన్స్

గ్లోబల్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ తన ప్రాజెక్ట్‌లను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బ తీసినా.. ఈ మధ్యే పెద్దితో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు రామ్ చరణ్.

ఇప్పుడిక తనకు రంగస్థలంలాంటి బ్లాక్‌బస్టర్ అందించిన సుకుమార్ తో మరో మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే సుకుమార్ కాంబినేషన్ కావడంతో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇక చరణ్ ఈ మధ్యే తన చేతికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. పెద్ది షూటింగ్ సమయంలో మణికట్టుకు అయిన గాయానికి ఆయన సర్జరీ చేయించుకున్నారు.

చరణ్ ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో పండగలను జరుపుకోవడంలో చరణ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన కృష్ణాష్టమి పిక్స్ మెగా అభిమానులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అసలైన కనుల పండువగా నిలిచాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More