Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) నుంచి మరో పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామా రాబోతోంది. ముంబైకి చెందిన ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవిత విశేషాల ఆధారంగా వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంపెనీ’. టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు.
పోలీస్ కంపెనీ రిలీజ్ డేట్

చాలా రోజుల తర్వాత అదిరిపోయే కాన్సెప్ట్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా రాబోతుంది. పోలీస్ స్టోరీతో మళ్లీ ఆర్జీవీ ఓ డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చాటుతాడనే టాక్ వినిపిస్తోంది. ఈ పోలీస్ కంపెనీ మూవీని జూన్ 4, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
‘‘డీ కంపెనీ కంటే పోలీస్ కంపెనీ ఇంకా డేంజరస్. ఎందుకంటే, 1997 నుంచి 2004 వరకు 319 గ్యాంగ్‌స్టర్స్ ను చంపారు. వాళ్లు ప్రతి ఒక్కరినీ చంపడానికి వచ్చేస్తున్నారు. మూవీ జూన్ 4, 2027న రిలీజ్ అవుతుంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
అగ్ర నిర్మాణ సంస్థలు
ఈ పోలీస్ కంపెనీ సినిమాలో హర్షవర్ధన్ రాణేతో పాటు ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్, సౌరభ్ శుక్లా, మకరంద్ దేశ్‌పాండే, అశ్విని కల్సేకర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను గుల్షన్ కుమార్ సమర్పణలో టి-సిరీస్ ఫిలిమ్స్, ఆర్‌జివి కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
'కంపెనీ' ప్రపంచంలోకి మరోసారి
రామ్ గోపాల్ వర్మ కెరీర్లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ క్రైమ్ డ్రామా ‘కంపెనీ’ ప్రపంచాన్ని ఈ పోలీస్ కంపెనీ సినిమా మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యం, దాన్ని అణచివేయడానికి పోలీసులు చేసిన వ్యూహాత్మక ఆపరేషన్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. వర్మ మార్క్ మేకింగ్‌తో ముంబై గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
యథార్థ సంఘటనల ఆధారంగా
{{/usCountry}}రామ్ గోపాల్ వర్మ కెరీర్లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ క్రైమ్ డ్రామా ‘కంపెనీ’ ప్రపంచాన్ని ఈ పోలీస్ కంపెనీ సినిమా మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యం, దాన్ని అణచివేయడానికి పోలీసులు చేసిన వ్యూహాత్మక ఆపరేషన్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. వర్మ మార్క్ మేకింగ్‌తో ముంబై గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
యథార్థ సంఘటనల ఆధారంగా
{{/usCountry}}'పోలీస్ కంపెనీ' చిత్రం పూర్తిగా నిజ జీవిత పాత్రలు, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. నాటి ముంబై నేర సామ్రాజ్యంలో దాదాపు 300 మంది గ్యాంగ్‌స్టర్లను పోలీసులు ఏ పరిస్థితులలో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై అండర్‌వరల్డ్ హిస్టరీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.