Ram Gopal Varma Sridevi: శ్రీదేవి బయోగ్రఫీలో నాదే బెస్ట్ ఛాప్టర్.. ఆమె మళ్లీ భూమిపైకి రావాలి: రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma Sridevi: దివంగత నటి శ్రీదేవి గురించి రామ్ గోపాల్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమెపై తాజాగా వచ్చిన బుక్ ఎంప్రెస్ పై ఆర్జీవీ స్పందిస్తూ.. అందులో తాను రాసిన ఛాప్టరే బెస్ట్ అని చాలా మంది చెబుతున్నట్లు వెల్లడించారు.
Ram Gopal Varma Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ 'ది ఎంప్రెస్' (The Empress) ప్రకటన తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీదేవితో తనకు ఉన్న అనుబంధం, ఆమె నటన వెనుకున్న మ్యాజిక్ గురించి మాట్లాడుతూ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

"చనిపోయిన వారి గురించి నేను అస్సలు ఆలోచించను!"
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల శ్రీదేవి జయంతి సందర్భంగా ధీరజ్ యు. కుమార్ రాసిన 'ది ఎంప్రెస్' పుస్తకం కవర్ పేజీని లాంచ్ చేశారు. ఈ పుస్తకంలో రామ్ గోపాల్ వర్మ ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాశారు. అయితే శ్రీదేవి జయంతి రోజున ఆమెను గుర్తు చేసుకున్నారా అని అడిగితే ఆర్జీవీ తనదైన శైలిలో మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
"నేను చనిపోయిన వారి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఒకసారి వారు వెళ్లిపోతే ఇక నా లైఫ్ నుంచి వెళ్లిపోయినట్లే. చనిపోయిన వారిని తలచుకోవడం కంటే నా వర్క్ పైన ఫోకస్ పెట్టడమే నాకు ఇష్టం. ప్రస్తుతం నేను హర్షవర్ధన్ రాణెతో 'పోలీస్ కంపెనీ' షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాను" అని వర్మ స్పష్టం చేశారు.
'ది ఎంప్రెస్' కాదు.. 'స్క్రీన్ క్వీన్' అయితే బాగుండేది!
ఈ బయోపిక్ పేరు 'ది ఎంప్రెస్' అని తనకు మొదట్లో తెలియదని వర్మ చెప్పారు. శ్రీదేవికి 'స్క్రీన్ క్వీన్' అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని, ఆమె తర్వాతే ఎవరైనా అని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో తను రాసిన చాప్టర్ అందరి కంటే బెస్ట్ అని చాలా మంది చెబుతున్నారని వర్మ కామెంట్ చేశారు.
శ్రీదేవి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, తెరపై ఆమె చేసిన మ్యాజిక్ ఏంటో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఆర్జీవీ అన్నారు. ముఖ్యంగా 'మిస్టర్ ఇండియా' సినిమాలో చార్లీ చాప్లిన్ సీక్వెన్స్ వెనుక ఉన్న నటన, క్రాఫ్ట్ ఊహించడం ఎవరి వల్ల కాదని, తాను డైరెక్ట్ చేసిన యాక్టర్స్‌లో ఆమె నంబర్ వన్ అని కొనియాడారు.
'క్షణ క్షణం' అనుభవాలు.. 7 నక్షత్రాల హోటల్ లాంటిది
శ్రీదేవితో కలిసి వర్మ తీసిన క్లాసిక్ థ్రిల్లర్ 'క్షణ క్షణం' ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. "నాకు ఆమెను ఒకే ఒక్కసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అది నాకు చాలు. ప్రతి సీన్‌కు ఆమె దగ్గర 15 నుంచి 20 రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఉండేవి. ఆమెతో వర్క్ చేయడం అంటే 7-స్టార్ హోటల్‌లో స్టే చేసినట్లే ఉంటుంది" అని వర్మ చెప్పారు.
శ్రీదేవిని మొదటిసారి చెన్నైలోని ఆమె ఇంట్లో కలిసిన క్షణాలను వర్మ రివీల్ చేశారు. "ఆమె నన్ను కలవడానికి గదిలోకి రావడం, ఫ్లైట్ టైమ్ అవుతోందని హడావుడిగా ప్యాకింగ్ చేసుకుంటూ రూమ్‌లోకి వచ్చి వెళ్లడం నాకింకా గుర్తుంది. ఆమె ప్రవేశించిన ప్రతిసారి ఒక చల్లటి తాజా గాలి వేగంగా వచ్చినట్లు అనిపించేది. ఒక్కసారైనా ఆమె మళ్లీ ఈ భూమి మీదకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడే మానవాళికి ఆమె నిజంగా ఈ లోకంలో ఉండిందనే విషయం నమ్మకం కుదురుతుంది" అని ఆర్జీవీ ఎమోషనల్ అయ్యారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్, శ్రీదేవిపై ఆయనకున్న ఆరాధన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


