...
...
Next Story

సినిమా ముగింపు మొదలైందా? ఏఐ విధ్వంసంపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. ఒక్క రోజులోనే హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో మూవీ

రామ్ గోపాల్ వర్మ రెండు రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఏఐతో చేసిన ఓ మూవీ వీడియోను షేర్ చేస్తూ ఇక సినిమాల పనైపోయినట్లే అని అన్నాడు. ఏఐ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యల్లో ఒకటని చెప్పాడు.

Published on: Feb 19, 2026, 20:59:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రామ్ గోపాల్ వర్మ ఏం ట్వీట్ చేసినా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అతడు తాజాగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో చేసిన ఓ మూడు నిమిషాల మూవీ క్లిప్ ను అతడు షేర్ చేస్తూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ డైరెక్టర్ చేసిన ట్వీట్లలో ఏముందో చూడండి.

ఏఐపై ఆర్జీవీ ట్వీట్

ఇక సినిమాల పనైపోయినట్లే.. ప్రపంచానికి ఇవే రెండు అతిపెద్ద సమస్యలు: ఏఐతో తీసిన మూవీ వీడియో షేర్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్
ఇక సినిమాల పనైపోయినట్లే.. ప్రపంచానికి ఇవే రెండు అతిపెద్ద సమస్యలు: ఏఐతో తీసిన మూవీ వీడియో షేర్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం (ఫిబ్రవరి 18) ఓ ట్వీట్ చేశాడు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ చేసిన ఓ సినిమా క్లిప్ ను షేర్ చేశాడు. కేవలం ఒక్క రోజులోనే తాము ఈ సినిమాను ఏఐ సాయంతో క్రియేట్ చేశామంటూ ది డోర్ బ్రదర్స్ చేసిన ట్వీట్ ను ఆర్జీవీ రీట్వీట్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

“ఇది చూసిన తర్వాత సినిమాలకు ఇక ముగింపు వచ్చేసినట్లే అని నమ్మి తీరాల్సిందే. చివరి వరకూ చూడండి” అంటూ ఆ ట్వీట్ ను ఆర్జీవీ రీట్వీట్ చేశాడు. ఆ వీడియోలో భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాల్లో ఉండే స్థాయి విజువల్స్ ఉన్నాయి. జియో మాగ్నటిక్ తుఫాను కారణంగా భూమిపై జరిగే విధ్వంసాన్ని అందులో చూడొచ్చు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే హాలీవుడ్ సినిమాల్లోని విజువల్స్ ను ఏఐ సాయంతో కేవలం ఒక్క రోజులోనే క్రియేట్ చేసినట్లు అందులో చెప్పడం చూడొచ్చు.

ఏఐపై ఆర్జీవీ ఆందోళన

“మన ప్రపంచంలోని రెండు అతిపెద్ద సమస్యల్లో ఒకటి సహజ మూర్ఖత్వం కాగా.. మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అని ఆర్జీవీ అనడం గమనార్హం. అతని మాటలను బట్టి ఏఐ ద్వారా ప్రపంచానికి రాబోతున్న ముప్పు ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యే నటుడు రానా దగ్గుబాటి కూడా ఏఐపై స్పందిస్తూ.. చాలా త్వరగానే అది మన మనుషులందరినీ రీప్లేస్ చేయగలదని అనడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe