Ramayana Collection Records: ఇండియాలోనే కాదు- వియత్నాం, నేపాల్, ఇండోనేషియాలోనూ రామాయణం కలెక్షన్ల రికార్డు-ముఖ్య కారణమిదే

Ramayana Collection Records: బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారత్‌తో పాటు రామాయణ చరిత్ర, సంస్కృతితో విడదీయరాని బంధం ఉన్న ఇతర ఆసియా దేశాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.

Published on: Nov 13, 2026, 13:06:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana Collection Records: మన దేశంలో రామాయణానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ ఇతిహాస చిత్రం దానికి తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులను క్యాష్ చేసుకున్న ఈ మూవీ.. మొదటి 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల (గ్రాస్) క్లబ్‌లో చేరింది.

ఇండియాలోనే కాదు- వియత్నాం, నేపాల్, ఇండోనేషియాలోనూ రామాయణం కలెక్షన్ల రికార్డు-ముఖ్య కారణమిదే (x/WorldOfRamayana)
ఇండియాలోనే కాదు- వియత్నాం, నేపాల్, ఇండోనేషియాలోనూ రామాయణం కలెక్షన్ల రికార్డు-ముఖ్య కారణమిదే (x/WorldOfRamayana)

సౌత్ ఈస్ట్ ఆసియాలో

రామాయణం కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.. ఆసియాలోని దాదాపు 300కు పైగా ప్రాంతీయ వర్షన్లలో ఈ ఇతిహాసం ప్రాచుర్యంలో ఉంది. ఇండోనేషియాలో కకావిన్ రామాయణ, బాలినీస్ రామకవచ తదితర పేర్లతో శతాబ్దాలుగా రామాయణం వారి సంస్కృతిలో భాగమైంది. అందుకే అక్కడ రామాయణం మూవీ ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా లక్ష డాలర్లు (సుమారు రూ.1 కోటి) వసూలు చేసి, ఇండోనేషియాలో ఒక ఇండియన్ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది.

థాయ్‌లాండ్‌లో ఇలా

అలాగే థాయ్‌లాండ్‌లో 'రామకీన్' పేరుతో రామాయణం ఫేమస్. అక్కడ ఈ చిత్రం వారం రోజుల్లోనే 1 మిలియన్ డాలర్లు (రూ.9 కోట్లు) కొల్లగొట్టింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఉన్న కంబోడియాలో 'రీమ్‌కర్' పేరుతో రామాయణాన్ని స్కూల్ సిలబస్‌లో బోధిస్తారు. అక్కడ తొలి వీకెండ్‌లోనే 1.5 లక్షల డాలర్లు రాబట్టగా, పొరుగున ఉన్న మలేషియాలో కేవలం వారం లోపే 9 లక్షల డాలర్లు (రూ.8 కోట్లు) వసూలు చేసి ఔరా అనిపించింది.

వియత్నాంలో క్రేజ్

సాధారణంగా వియత్నాంలో ఇండియన్ సినిమాలకు పెద్ద మార్కెట్ లేదు. అక్కడ మన సినిమాలు 20 వేల డాలర్లు (రూ.15-18 లక్షలు) రాబట్టడమే గగనం. కానీ 'రామాయణం' ఆ రికార్డును తొలి రోజే బ్రేక్ చేసి, ఇప్పటివరకు ఏకంగా 3.5 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) వసూలు చేసింది.

వియత్నాంను 1500 ఏళ్ల పాటు పాలించిన చంపా రాజవంశం హిందూ సంస్కృతిని ఆదరించింది. అక్కడ 1300 ఏళ్ల నాటి వాల్మీకి మహర్షి ఆలయం ఉండటం విశేషం. దానికి తోడు అక్కడ స్కూల్స్, కాలేజీల్లో రామాయణాన్ని ప్రపంచ సాహిత్య పాఠ్యాంశంగా బోధిస్తారు. అందుకే ఈ సినిమాకు అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు.

నేపాల్‌లో 'బాహుబలి 2' రికార్డులపై గురి

నేపాల్‌లో మన సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే 'రామాయణం' అక్కడ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీక్‌లో 12.80 కోట్ల నేపాల్ రూపాయలు (రూ.8 కోట్లు) కలెక్షన్లు వసూలు చేసింది.

ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ అయిన 'ఆర్ఆర్ఆర్', 'పఠాన్', 'జవాన్' ఫుల్ రన్ కలెక్షన్లను నేపాల్ లో రామాయణం క్రాస్ చేసింది. త్వరలోనే ఇది 'బాహుబలి 2' పేరిట ఉన్న 25.20 కోట్ల (NPR) ఆల్ టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More