Ramayana Review: భారతీయుల గుండెల్లో రామాయణానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమారు 39 ఏళ్ల క్రితం రామానంద్ సాగర్ రూపొందించిన 'రామాయణ్' సీరియల్ ప్రసారమైనప్పుడు దేశమంతా స్తంభించిపోయేది. అలాంటి ఒక చారిత్రక వారసత్వాన్ని, కోట్లాది మంది భావోద్వేగాలను వెండితెరపై మరోసారి చూపించడం సాధారణ విషయం కాదు.

మరి అంతటి భారీ బాధ్యతను భుజానెత్తుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేష్ తివారీ 'రామాయణం: పార్ట్ 1' (Ramayana Part 1)తో ఆ మెరుపును మళ్లీ తీసుకరాగలిగారా? ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగారా?
‘రామాయణం పార్ట్ 1’ మూవీ విశేషాలు
నటీనటులు: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, రవి దూబే, లారా దత్తా, అరుణ్ గోవిల్, శీబా చద్దా తదితరులు
దర్శకత్వం: నితేష్ తివారీ
సంగీతం: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్
విజువల్ ఎఫెక్ట్స్ (VFX): DNEG (నమిత్ మల్హోత్రా)
రేటింగ్: 4 / 5 (4/5 stars)
కథ, స్క్రీన్‌ప్లే ఇలా..: రామాయణ మూలాలను తాకుతూ..
వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను లంకేశ్వరుడైన రావణాసురుడి (యశ్) గత చరిత్రతో ప్రారంభించడం కథకు ఒక బలమైన పునాదిని వేసింది. రాముడి ఎంట్రీకి ముందు రావణుడి శక్తియుక్తులను చూపించడం ద్వారా కథలో చక్కటి ఉత్కంఠను నెలకొల్పారు.
శ్రీధర్ రాఘవన్, నితేష్ తివారీలు అందించిన స్క్రీన్‌ప్లేలో ఎమోషన్స్, డ్రామా పుష్కలంగా ఉన్నాయి. అయితే కథను రెండు భాగాలుగా విభజించాలనే ఆలోచన వల్ల మొదటి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. దీనివల్ల ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని చోట్ల AI డబ్బింగ్ సంబంధిత చిన్నపాటి లోపాలు కనిపిస్తాయి. అయితే ద్వితీయార్థంలో మాత్రం యాక్షన్ మోడ్ స్టార్ట్ అయి, సినిమా వేగాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్తుంది.
యశ్ రచ్చ.. రణబీర్, సాయి పల్లవిల నటన ఎలా ఉందంటే?
ఈ చిత్రానికి బిగ్గెస్ట్ హైలైట్ అంటే అది యశ్ (Yash) నటన అని చెప్పక తప్పదు. 'టాక్సిక్' తర్వాత రావణాసురుడిగా యశ్ చూపించిన రాజసం, గర్వం, గంభీరమైన గొంతు ప్రేక్షకులను మైమరిపిస్తాయి. రావణుడి పది తలలను తెరపై చూపించిన విధానం అద్భుతం.
{{/usCountry}}ఈ చిత్రానికి బిగ్గెస్ట్ హైలైట్ అంటే అది యశ్ (Yash) నటన అని చెప్పక తప్పదు. 'టాక్సిక్' తర్వాత రావణాసురుడిగా యశ్ చూపించిన రాజసం, గర్వం, గంభీరమైన గొంతు ప్రేక్షకులను మైమరిపిస్తాయి. రావణుడి పది తలలను తెరపై చూపించిన విధానం అద్భుతం.
{{/usCountry}}ఇక రాముడి పాత్రలో రణబీర్ కపూర్ యాక్షన్ సీన్స్‌లో చాలా సునాయాసంగా నటించారు. అయితే గతంలో అరుణ్ గోవిల్ పండించిన భక్తిభావాన్ని రణబీర్ పూర్తిస్థాయిలో అందుకోలేకపోయారనే భావన కలుగుతుంది. విశేషమేమిటంటే, ఆనాటి రాముడు అరుణ్ గోవిల్ ఇక్కడ దశరథుడిగా కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అటు సీతాదేవిగా సాయి పల్లవి కాస్టింగ్ పై మొదట్లో వచ్చిన అనుమానాలన్నింటినీ తన నటనతో పటాపంచలు చేసింది. తెరపై ఆమె కనిపించిన క్షణాలన్నీ అమాయకత్వం, గౌరవంతో నిండిపోయాయి.
లక్ష్మణుడిగా రవి దూబే భావోద్వేగాలను, కోపాన్ని చక్కగా పండించారు. కైకేయిగా లారా దత్తా, మంధరగా శీబా చద్దా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
విజువల్ వండర్: 4000 కోట్ల బడ్జెట్ కనిపించింది.. ఆ సీన్ గూస్బంప్స్
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ DNEG అందించిన VFX ఈ సినిమాకి ప్రాణవాయువు. రూ. 4000 కోట్ల అంచనా బడ్జెట్లో 70 శాతానికి పైగా సాంకేతిక విభాగానికే ఖర్చు చేశారనే ప్రచారానికి తగ్గట్లే, ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్లా ఉంది. కుబేరుడి నుంచి లంకను రావణుడు చేజిక్కించుకోవడం, కైకేయి తప్పు తెలుసుకునే సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోకి లాక్కుపోతాయి.
ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే జటాయు సీన్ సినిమాకే హైలైట్. సీతాదేవిని కాపాడేందుకు జటాయువు రావణుడితో పోరాడే ఘట్టం (అనుపమ్ ఖేర్ వాయిస్ ఓవర్) ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది.
మ్యూజిక్, టెక్నికల్ అంశాలు: ఎక్కడ తగ్గింది?
హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కలయికలో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఆకాశాన్నంటిన అంచనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందనే చెప్పాలి. కొన్ని పాటలు కథా గమనానికి అడ్డుపడినట్లు అనిపిస్తాయి.
పార్ట్ 2 కోసం ఫైర్వర్క్స్ సిద్ధం
పది తలల రావణుడిని ఎదిరించడం ఎంత కష్టమో, ఒక దేశం మొత్తం ఉన్న అంచనాలను తట్టుకుని సినిమా తీయడం అంతకంటే కష్టం. కానీ నితేష్ తివారీ అండ్ టీమ్ ‘రామాయణం పార్ట్ 1’తో ఆ సవాలును ఘనంగా అధిగమించారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ ఎంట్రీ, సంజీవని పర్వతం సీన్, అసలైన లంకాయుద్ధం అంతా పార్ట్ 2లోనే ఉండబోతోంది. పార్ట్ 1 ఇచ్చిన ఈ సాలిడ్ పునాదితో పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.