Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీ పోరగాళ్ల కిరాక్ బిర్యానీ రచ్చ.. రానా దగ్గుబాటి ‘అమీర్‌ లోగ్’ ట్రైలర్ చూశారా?

Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీల్లోని వాతావరణం ఇష్టపడే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు అమీర్ లోగ్. ఆగస్ట్ 21న థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను గురువారం (ఆగస్ట్ 13) రిలీజ్ చేశారు.

Published on: Aug 13, 2026, 22:12:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీ లోకల్ ఫ్లేవర్‌తో మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బస్తీ పోరగాళ్లు చేసే హంగామాతో థియేటర్లలో మార్మోగనున్నాయి. దగ్గుబాటి రానా సమర్పణలో అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'అమీర్ లోగ్' మూవీ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ అయి యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీ పోరగాళ్ల కిరాక్ బిర్యానీ రచ్చ.. రానా దగ్గుబాటి ‘అమీర్‌ లోగ్’ ట్రైలర్ చూశారా?
Ameerlog Trailer: హైదరాబాద్ బస్తీ పోరగాళ్ల కిరాక్ బిర్యానీ రచ్చ.. రానా దగ్గుబాటి ‘అమీర్‌ లోగ్’ ట్రైలర్ చూశారా?

గల్లీ క్రికెట్ నుంచి 'కిరాక్ బిర్యానీ' బిజినెస్ దాకా..

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచూరి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి 'స్పిరిట్ మీడియా' పతాకంపై ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ హైదరాబాద్‌లోని ఒక లోకల్ బస్తీలో ఉండే నలుగురు యంగ్ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. రోజూ గల్లీ క్రికెట్, ఫ్రెండ్‌షిప్, వీధి దాబాల దగ్గర హడావుడి, ఫ్యామిలీ ప్రెజర్స్, మెరుగైన భవిష్యత్తు కోసం కలలు కనడం వారి రొటీన్ లైఫ్‌గా సాగుతుంది.

అయితే ఊరికే ఒక లోకల్ విందులో అనుకోకుండా వచ్చిన చిన్న ఐడియా వాళ్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. ఆ ఐడియానే 'కిరాక్ బిర్యానీ' స్టార్టప్ బిజినెస్. ఆ సాదాసీదా బిర్యానీ వ్యాపారంలోకి దిగిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి ఊహించని ట్విస్టులు వచ్చాయో చాలా ఫన్నీగా చూపించారు.

హైదరాబాద్ లోకల్ వైబ్స్.. ఎమోషనల్ సీన్స్

ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధ జలంధర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించి స్క్రీన్ పై అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. వాళ్ల మాటలు, సరదా గొడవలు, బస్తీ యాస రియల్ లైఫ్ క్యారెక్టర్లను గుర్తుకు తెచ్చేలా ఎంతో నాచురల్‌గా కుదిరాయి.

డైరెక్టర్ రమణ రెడ్డి సోమ హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్ ను పర్‌ఫెక్ట్‌గా పట్టుకున్నారు. యూత్‌ ఆశయాలను, తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే కామెడీని, ఎమోషన్‌ను సరైన పాళ్లలో మిక్స్ చేసి ప్రతి సీన్‌ను రక్తి కట్టించారు.

ఎస్వీకే అందించిన విజువల్స్ హైదరాబాద్ బస్తీల రంగూ రుచీ సరికొత్తగా ప్రెజెంట్ చేశాయి. స్మరన్ సాయి అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ టెంపోను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తుండటంతో 'అమీర్ లోగ్' ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. వినోదానికి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కించిన ఈ యంగ్ అండ్ ఫ్రెష్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది.

అయితే అదే రోజు మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి కూడా థియేటర్లలో రిలీజ్ కానుండటంతో ఈ అమీర్ లోగ్ మూవీకి గట్టి పోటీ ఉండనుంది. ఇరుముడి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈ అమీర్ లోగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More