Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి రణబాలి రా నీ అక్క.. విజయ్ దేవరకొండ విశ్వరూపం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రణబాలి టీజర్
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్ రోల్స్ పోషిస్తున్న రణబాలి మూవీ టీజర్ రిలీజైంది. విజయ్ విశ్వరూపంతో ఈ టీజర్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. అక్టోబర్ 16న ఈ పీరియాడిక్ డ్రామా థియేటర్లలో రిలీజ్ కానుంది.
Ranabaali Teaser: రణబాలి మూవీ టీజర్ వచ్చేసింది. విజయ్ విశ్వరూపం చూపిస్తూ సాగిన ఈ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది. బ్రిటిష్ పాలకుల అరాచకాలను ఎదిరిస్తూ రౌద్రంతో విరుచుకుపడే పోరాట యోధుడిగా విజయ్ దేవరకొండ రా అండ్ రస్టిక్ అవతారంలో కనిపించారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రణబాలి' (Ranabaali) టీజర్ రిలీజ్ కాగా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
19వ శతాబ్దం నాటి బ్రిటిష్ దౌర్జన్యాలు.. కరువు నేపథ్యం
'కింగ్ డమ్' (Kingdom) సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని విజయ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ క్రమంలోనే 1854 నుండి 1878 మధ్య మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన యథార్థ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు.
బ్రిటీష్ రాజ్యంలో ప్రాణాలు కోల్పోయిన 80 లక్షల మంది భారతీయుల జ్ఞాపకార్థం అంటూ ఈ టీజర్ మొదలైంది. బ్రిటిష్ జనరల్స్ భారతీయ రైతుల ధాన్యాన్ని దోచుకుంటూ, అమాయక ప్రజలను అత్యంత క్రూరంగా హత్య చేస్తుంటారు. ఆ సమయంలో కరవుతో విలవిలలాడుతున్న ప్రజల కోసం ఆపద్బాంధవుడిగా 'సింగనమల బొబ్బిలి రణబాలి' అనే తిరుగుబాటుదారుడు పుట్టుకొస్తాడు.
సింగనమల బొబ్బిలి రణబాలి రా నీ అక్క అంటూ సీమ యాసలో విజయ్ చెప్పే డైలాగులు కూడా హైలైట్ గా నిలిచాయి. ఇక టీజర్ చివర్లో ఓ సస్పెన్స్ క్రియేట్ చేసేలా పెట్టిన సీన్ ఆసక్తి రేపుతోంది. చివర్లో వచ్చే ఆ పాత్ర ఎవరిది అన్నది మూవీలోనే చూడాలి.
రౌద్రంతో రగిలిపోయిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ తన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పూర్తిగా మార్చేసి అచ్చమైన యోధుడిలా మెరిశారు. గుర్రపు స్వారీ చేస్తూ, చేతిలో ఆయుధం పట్టి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయే సీన్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ గతంలో 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో తన విజన్ ఏంటో నిరూపించుకున్నారు. ఈసారి కూడా బ్రిటిష్ కాలం నాటి విజువల్స్, విలేజ్ సెటప్స్, రా యాక్షన్ ఎలిమెంట్స్ చాలా రిచ్‌గా డిజైన్ చేశారు.
అజయ్-అతుల్ బీజీఎమ్.. మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్
బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ప్రతీ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. వాళ్ల ఇంటెన్స్ బీజీఎమ్ యాక్షన్ సీక్వెన్సులకు జీవం పోసింది.
మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రొడక్షన్‌ను రూపొందిస్తున్నాయి. విజువల్ గ్రాండియర్, లొకేషన్స్ క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.
అక్టోబర్ 16న బాక్సాఫీస్ వేట
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టేందుకు రణబాలి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాకు రజనీకాంత్ జైలర్ 2 రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


