Ramayana Screening: రామాయణ స్పెషల్ స్క్రీనింగ్.. 15 నిమిషాల విజువల్స్ చూసి నోరెళ్లబెట్టిన థియేటర్ల ఓనర్లు..

Ramayana Screening: రామాయణ మూవీకి సంబంధించి 15 నిమిషాల స్పెషల్ స్క్రీనింగ్ చెన్నైలోని థియేటర్ల ఓనర్లను షాక్ కు గురి చేసింది. చెన్నై ఎక్స్‌పోలో భాగంగా ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు ది వెరైటీ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.

Published on: Aug 27, 2026, 17:18:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana Screening: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) నుంచి ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ 15 నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ను చెన్నైలో జరిగిన 'బిగ్ సినీ ఎక్స్‌పో 2026'లో ప్రదర్శించారు. థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రమే చూపించిన ఈ స్పెషల్ క్లిప్‌లో రణబీర్ కపూర్, యశ్ క్యారెక్టర్ల విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

Ramayana Screening: రామాయణ స్పెషల్ స్క్రీనింగ్.. 15 నిమిషాల విజువల్స్ చూసి నోరెళ్లబెట్టిన థియేటర్ల ఓనర్లు..
Ramayana Screening: రామాయణ స్పెషల్ స్క్రీనింగ్.. 15 నిమిషాల విజువల్స్ చూసి నోరెళ్లబెట్టిన థియేటర్ల ఓనర్లు..

'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' రేంజ్ విఎఫ్ఎక్స్.. మైండ్ బ్లాక్ ఫుటేజ్

చెన్నై వేదికగా జరిగిన ఎగ్జిబిటర్ల సమ్మిట్‌లో ఫోన్లు అస్సలు అనుమతించకుండా అత్యంత కఠినమైన సెక్యూరిటీ మధ్య రామాయణ ఫుటేజ్ ప్రదర్శించారు. ఇందులో వన్-ఐడ్ దైత్య (ఒంటికన్ను రాక్షసుడు), కరడి రూపంలో ఉన్న భయానక జీవులకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ విజువల్స్ చూసిన ప్రముఖ ఎగ్జిబిటర్లు ఈ సినిమా స్కేల్‌ను హాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజ్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' (The Lord of the Rings)తో పోల్చడం విశేషం. ఇప్పటికే లాస్ వేగాస్‌లో జరిగిన 'సినిమాకాన్'లో ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా కొన్ని సీన్లు ప్రదర్శించి అప్పట్లోనే సంచలనం సృష్టించారు.

రణబీర్, యశ్, సాయి పల్లవి.. నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్

ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తోంది. ఇక కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్ లంకేశ్వరుడు రావణాసురుడిగా విలన్ అవతారంలో అలరించబోతున్నారు.

వీరితో పాటు హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్, ఆస్కార్ విన్నింగ్ విఎఫ్‌ఎక్స్ సంస్థ డిఎన్‌ఇజి (DNEG) అధినేత నమిత్ మల్హోత్రా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ మ్యూజిక్ మ్యాజిక్

ఈ రామాయణ సినిమాకు సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్. రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) ఇద్దరూ కలిసి ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌కు బీజీఎం, పాటలు అందిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. మొదటి భాగం 'రామాయణం పార్ట్ 1' 2026 దీపావళి కానుకగా నవంబర్ 6న వరల్డ్ వైడ్‌గా, నవంబర్ 8న ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించిన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ నటనకు బ్రహ్మరథం పట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో ఈ రెండు భాగాల రామాయణం తెరకెక్కుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More