...
...
Next Story

Dhurandhar: జీసస్ తరహాలో రణ్‌వీర్ సింగ్ పాత్ర- ధురంధర్ 2లో ఆ సీన్లు అందుకేనా? మాజీ మిస్ ఇంగ్లాండ్ ఏం చెబుతోంది?

Ranveer Singh Jesus Imagery In Dhurandhar: ధురంధర్ చిత్రాల్లో రణ్‌వీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారీ పాత్రపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పాత్ర చిత్రణలో దర్శకుడు ఆదిత్య ధర్ జీసస్ క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రతీకలను వాడారంటూ మాజీ మిస్ ఇంగ్లాండ్ భాషా ముఖర్జీ విశ్లేషించారు.

Published on: Apr 8, 2026, 13:00:25 IST
Advertisement

దర్శకుడు ఆదిత్య ధర్ వెండితెరపై సృష్టించే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక బలమైన అర్థం ఉంటుంది. తాజాగా విడుదలైన 'ధురంధర్' సిరీస్‌లో రణ్‌వీర్ సింగ్ పోషించిన జస్కిరాత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) పాత్రను ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఓన్ చేసుకున్నారు.

జీసస్ తరహాలో రణ్‌వీర్ సింగ్ పాత్ర- ధురంధర్ 2లో ఆ సీన్లు అందుకేనా? మాజీ మిస్ ఇంగ్లాండ్ ఏం చెబుతోంది?
జీసస్ తరహాలో రణ్‌వీర్ సింగ్ పాత్ర- ధురంధర్ 2లో ఆ సీన్లు అందుకేనా? మాజీ మిస్ ఇంగ్లాండ్ ఏం చెబుతోంది?

అయితే, ఈ పాత్ర కేవలం ఒక గూఢచారి కథ మాత్రమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక ప్రతీకలు ఉన్నాయని మాజీ మిస్ ఇంగ్లాండ్ డాక్టర్ భాషా ముఖర్జీ చేసిన విశ్లేషణ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 'ధురంధర్ 2' క్లైమాక్స్‌లో వచ్చే ఒక సన్నివేశాన్ని భాషా ముఖర్జీ ఉదహరించారు.

సిలువ వేయబడిన త్యాగమూర్తిలా హంజా!

హంజాను పాకిస్థాన్ సైన్యం బంధించి చిత్రహింసలకు గురిచేసే సీన్ అది. రక్తపు మడుగులో ఉండి, చేతులు పైకి కట్టేసి ఉన్న రణ్‌వీర్ సింగ్ రూపం.. సరిగ్గా సిలువపై ఉన్న ఏసుక్రీస్తును తలపిస్తుందని భాషా ముఖర్జీ పేర్కొన్నారు.

"ఆ సీన్ కేవలం హింసను చూపించడానికి తీసింది కాదు. తన దేశం కోసం, తన ప్రజల కోసం హంజా పడుతున్న బాధను ఒక త్యాగంగా (Martyrdom) చూపించారు. ఏసుక్రీస్తును దేవుడి బిడ్డగా ఎలా కొలుస్తారో, ఇక్కడ హంజాను దేశ బిడ్డగా అభివర్ణించారు," అని మాజీ మిస్ ఇంగ్లాండ్ భాషా ముఖర్జీ వివరించారు.

పునర్జన్మకు సంకేతం.. ఆదిత్య ధర్ డీటెయిలింగ్!

కేవలం బాధను చూపడమే కాదు, ఈ ఇమేజరీ వెనుక 'పునర్జన్మ' (Resurrection) అనే కోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హంజా అలీ మజారీగా ఆ పాత్ర మరణించి, తిరిగి జస్కిరాత్ సింగ్‌గా అవతరించడానికి ముందు ఈ టార్చర్ సీన్ రావడం గమనార్హం.

సోషల్ మీడియాలో కూడా దీనిపై భారీ చర్చ నడుస్తోంది. ఒక యూజర్ స్పందిస్తూ.. "ఆదిత్య ధర్ కేవలం జీసస్ మాత్రమే కాదు.. లూసిఫర్, కృష్ణుడు, శివుడి అంశాలను కూడా రణవీర్ పాత్రలో మిళితం చేశారు" అని కొనియాడారు.

మరికొందరు జస్కిరాత్ అనే పేరుకు ఉన్న అర్థాన్ని వెతుకుతున్నారు. 'జస్కిరాత్' అంటే భగవంతుడి నామాన్ని స్మరించేవాడు లేదా దైవకార్యం చేసేవాడు అని అర్థం. ఏసుక్రీస్తు కూడా భగవంతుడి పని మీద భూమికి వచ్చారనే నమ్మకం ఉంది, కాబట్టి ఈ పోలిక కరెక్టేనని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. 'ధురంధర్' ట్రైలర్‌లో రణ్‌వీర్‌ను 'దేవుడి ఆగ్రహం' (Wrath of God) అని పరిచయం చేయడం కూడా ఈ థియరీకి బలం చేకూరుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ప్రభంజనం

ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభకు రణ్‌వీర్ సింగ్ నటన తోడవడంతో ధురంధర్ 2 సినిమాలు కనకవర్షం కురిపించాయి. ధురంధర్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే.. ధురంధర్ 2 మార్చి 19న విడుదలై ఇప్పటికే రూ. 1600 కోట్ల మార్కును దాటేసింది.

ఈ ధురంధర్ చిత్రాల్లో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను సామాజిక, ఆధ్యాత్మిక కోణాలతో ముడిపెట్టి ఆదిత్య ధర్ ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్ సెట్ చేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe