...
...
Next Story

ఆ డైరెక్టర్‌కు సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను.. హీరోయిన్ రష్మిక మందన్నా కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్‌తో కలిసి రష్మిక నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. జూన్ 20న రిలీజైన కుబేర సూపర్ హిట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో కుబేర సక్సెస్ మీట్‌లో రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Jun 23, 2025, 10:46:28 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటోంది కుబేర మూవీ. హౌస్ ఫుల్ బుకింగ్స్‌తో సూపర్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న కుబేర సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

కుబేర బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్

ఆ డైరెక్టర్‌కు సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను.. హీరోయిన్ రష్మిక మందన్నా కామెంట్స్
ఆ డైరెక్టర్‌కు సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను.. హీరోయిన్ రష్మిక మందన్నా కామెంట్స్

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్‌ను ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుకలో నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

నా జర్నీలో పార్ట్ అయ్యారు

హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. చిరు గారు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. థాంక్ యు సర్. ఈ సినిమా కథ విన్న తర్వాత సెట్స్‌కు వెళ్లి డైరెక్టర్ గారికి సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఆయన ఎలా చెబితే అలా పర్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పింది.

మరో లెవెల్‌కు తీసుకెళ్లారు

"ఈ రోజు సమీర పాత్రకు వచ్చిన క్రెడిట్ డైరెక్టర్ గారికే దక్కుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం. ధనుష్ గారు, నాగార్జున గారు, శేఖర్ గారు ఈ సినిమాకి పిల్లర్స్. దేవీ శ్రీ గారు మ్యూజిక్‌తో మరో లెవల్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని హీరోయిన్ రష్మిక మందన్నా తెలిపింది.

లవ్ స్టోరీ అప్పుడు కూడా

ఇదే ఈవెంట్‌లో నిర్మాత పుష్కర్ రామ్ మోహన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన చిరంజీవి గారికి థాంక్ యూ. మంచి సినిమాకి ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. లవ్ స్టోరీ సినిమా అప్పుడు కూడా వచ్చారు. ఇప్పుడు కుబేర వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు" అని చెప్పారు

ఎంతో ఆనందంగా ఉంది

"ధనుష్ గారు, నాగార్జున గారితో కలిసి వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్. ఇంత పెద్ద కాన్వాస్ ఇచ్చిన శేఖర్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని డీవోపీ నికేత్ బొమ్మి చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks