Mysaa Release Date: రష్మిక మందన్న మాస్ యాక్షన్ అవతార్.. మైసా రిలీజ్ డేట్ వచ్చేసింది.. అచ్చొచ్చిన నెలలోనే..
Mysaa Release Date: రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తున్న మైసా మూవీ ఈ ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి రానుంది. గతేడాది నవంబర్ లో ది గర్ల్‌ఫ్రెండ్ తో హిట్ కొట్టగా ఈసారి కూడా మరో మూవీతో రాబోతుండటం విశేషం.
Mysaa Release Date: పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఇంటెన్స్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా లాక్ చేశారు. నవంబర్ 27, 2026న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

ట్రైబల్ యాక్షన్‌తో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్
"ది రేజ్, ది పెయిన్, ది గ్రీఫ్.. మైసా రాబోతోంది" అంటూ రష్మిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో నెత్తుటి మరకలతో, చేతిలో ఈటె పట్టుకుని ఒక గోండు యువతిగా రష్మిక నెవర్ బిఫోర్ ఊర మాస్ అవతార్‌లో కనిపిస్తోంది.
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌లో మెప్పించిన నేషనల్ క్రష్, ఈ సినిమాలో ఒక డేంజరస్ గిరిజన యువతిగా తనలోని ఇంటెన్స్ యాంగిల్‌ను బయటపెట్టబోతోంది.
రికార్డ్ బ్రేకింగ్ అండర్ వాటర్ ఫైట్
ఈ మైసా మూవీలో ఆడియన్స్‌ను థ్రిల్ చేసే ఒక సెన్సేషనల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానుంది. ఒక పవర్‌ఫుల్ అండర్ వాటర్ ఫైట్ కోసం రష్మిక దాదాపు 20 గంటల పాటు నీళ్లలోనే ప్రాక్టీస్ చేసి డెడికేషన్‌తో షూట్ కంప్లీట్ చేసింది.
ఆసియా ఫిల్మ్ హిస్టరీలోనే ఒక ఫిమేల్ యాక్టర్‌పై ఇలాంటి అండర్ వాటర్ యాక్షన్ సీన్ షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ ఒక్క సీన్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారెంటీ.
టాప్ టెక్నికల్ వాల్యూస్.. భారీ తారాగణం
డైరెక్టర్ రవీంద్ర పుల్లె (Rawindra Pulle) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం లాంటి భారీ క్యాస్టింగ్ ఉంది.
ముఖ్యంగా జేక్స్ బిజోయ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోయనున్నాయి. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ (UnFormula Films) బ్యానర్‌పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో పాన్ ఇండియా రిలీజ్ గా వస్తోంది.
వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ
తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా నవంబర్ 27న పాన్ ఇండియా లెవల్‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 'పుష్ప 2' లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత రష్మిక లైనప్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
రీసెంట్‌గా షాహిద్ కపూర్‌తో కలిసి బాలీవుడ్‌లో 'కాక్‌టెయిల్ 2' చేసిన రష్మిక.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన 'రణబాలి' సినిమాలో కూడా నటిస్తోంది. అక్టోబర్ 16న రణబాలి రిలీజ్ కానుండగా, నవంబర్‌లో 'మైసా' తో బాక్సాఫీస్ వద్ద తన యాక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోబోతోంది. గతేడాది నవంబర్ లోనే ది గర్ల్‌ఫ్రెండ్ తో సక్సెస్ అందుకోగా.. ఈసారి కూడా మైసాతో మరో హిట్ కోసం రష్మిక చూస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


