Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తీవ్ర గాయంతో ఆసుపత్రి పాలైనట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. తన అప్‌కమింగ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ 'మైసా' (Mysaa) డాన్స్ షూటింగ్‌లో రైట్ హిప్ (కుడి తొడ) దగ్గర ఒక నరం తెగిపోయినట్లు సంచలన విషయాలు వెల్లడించింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న రష్మిక.. తన హెల్త్ కండిషన్‌పై అభిమానుల్లో ఉన్న ఆందోళనకు తెరదించుతూ సుదీర్ఘమైన నోట్ షేర్ చేసింది.
"రైట్ హిప్‌లో నరం తెగిపోయింది!".. రష్మిక

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన రికవరీకి సంబంధించిన క్యూట్ ఫొటోలు, పజిల్స్ సాల్వ్ చేస్తున్న పిక్స్, పెట్ డాగ్స్‌తో ఉన్న పిక్చర్స్ షేర్ చేస్తూ రష్మిక ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది.
"గాయపడటం నిజంగా దారుణమైన ఎక్స్‌పీరియన్స్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అనుకున్నా.. కానీ నిజం దాచలేం కదా! నా కుడి తొడ భాగంలో కాలును తొడతో కలిపే నాలుగు ప్రధాన నరాల్లో ఒక నరం తెగిపోయి ఊడి వచ్చింది. అది మళ్లీ అతుక్కోవడానికి కాస్త టైమ్ పడుతుంది" అని పేర్కొంది.
ఇది తనకు వరుసగా మూడో గాయమని, ఇకపై తన శరీరాన్ని ఒక మిషన్‌లా కాకుండా మనిషిలా చూసుకోవడం నేర్చుకోవాలని రాసుకొచ్చింది.
“దేవుడు ఇచ్చిన బలవంతపు హాలిడే!”
ఈ నొప్పి భరించలేనిదేమీ కాదని, నాన్-స్టాప్ వర్క్ నుంచి కాస్త బ్రేక్ ఇవ్వడానికే దేవుడు ఇలా 'బలవంతపు హాలిడే' ఇచ్చాడని పాజిటివ్‌గా స్పందించింది రష్మిక. ఈ టైమ్‌లో జిమ్‌లో హెవీ వర్కవుట్స్ చేయడం, రన్నింగ్ చేయడం కుదరదని, అందుకే ఇంట్లోనే పజిల్స్ సాల్వ్ చేస్తూ సమయం గడుపుతున్నానని చెప్పింది.
వర్కవుట్స్ లేకపోవడంతో స్వీట్స్, డెసర్ట్స్ ఎక్కువగా తింటూ 'డెసర్ట్ మాన్స్టర్'గా మారిపోతున్నానని నవ్వుతూ కామెంట్ చేసింది.
'మైసా'లో యాక్షన్.. అండర్ వాటర్ స్టంట్స్
ఈ గాయం రష్మిక నటిస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా 'మైసా' డాన్స్ షూట్లో జరిగింది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక కెరీర్లోనే మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రోల్ చేస్తోంది.
{{/usCountry}}ఈ గాయం రష్మిక నటిస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా 'మైసా' డాన్స్ షూట్లో జరిగింది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక కెరీర్లోనే మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రోల్ చేస్తోంది.
{{/usCountry}}ఇటీవలే ఈ సినిమా కోసం భారత్‌లోనే తొలిసారిగా ఒక హీరోయిన్ పై చిత్రీకరించిన భారీ 'అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్' షూట్ పూర్తి చేశారు. గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రష్మిక రక్తంతో తడిసి, ఆయుధం చేతిలో పట్టుకుని గట్టిగా అరుస్తున్న విజువల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
'కాక్‌టెయిల్ 2' బిగ్ హిట్.. గ్లోబల్ వైడ్‌గా రూ.140 కోట్ల వసూళ్లు
ఇటీవలే రష్మిక బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటించిన రోమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. హోమి అదజానియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఒకవైపు 'పుష్ప 2' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక, త్వరలోనే కోలుకుని 'మైసా' టీజర్‌తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా 2026 ద్వితీయార్థంలో థియేటర్లలోకి రానుంది.