వెకేషన్‌కు లవ్ బర్డ్స్.. విజయ్, రష్మిక ఎయిర్‌పోర్టులో ఇలా.. ఇట్స్ హాలీడే టైమ్ అంటూ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెకేషన్ కు వెళ్లారు. ఈ ఇద్దరూ బుధవారం (డిసెంబర్ 24) హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఇట్స్ హాలీడే టైమ్ అంటూ విజయ్ ఓ పోస్ట్ చేయడం విశేషం.
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వెకేషన్‌కు వెళ్తూ కనిపించారు. కొన్ని నెలలుగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ జంట.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విజయ్, రష్మిక వెకేషన్
హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న బుధవారం (డిసెంబర్ 24) ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించారు. రష్మిక కొత్త సినిమా 'మైసా' గ్లింప్స్ విడుదలైన కొద్ది సేపటికే వీరిద్దరూ వెకేషన్‌కు వెళ్లడం విశేషం.
విజయ్ తన ట్రేడ్‌మార్క్ బీనీ క్యాప్, గ్రే కలర్ స్వెట్ షర్ట్ వేసుకోగా.. రష్మిక కంఫర్టబుల్ మోనోక్రోమ్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. ఇద్దరూ మాస్కులు ధరించి ఉన్నారు. వీరిని చూసి ఫ్యాన్స్ "క్యూట్ కపుల్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో రిలాక్స్ అవుతున్న ఫోటోను విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అందులో రష్మిక చేతిలో పోలరాయిడ్ కెమెరా పట్టుకుని విజయ్ ఫోటో తీస్తున్నట్లు ఉంది.
"గత కొన్ని నెలలుగా చాలా బిజీగా గడిచింది.. ఇప్పుడు హాలిడే టైమ్" అని విజయ్ క్యాప్షన్ ఇచ్చాడు. రష్మిక మాత్రం ఇంకా సోషల్ మీడియాలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. రౌడీ జనార్ధన సినిమాతో విజయ్ దేవరకొండ.. మైసా మూవీతో రష్మిక బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల టైటిల్ గ్లింప్స్ రోజుల వ్యవధిలో రిలీజ్ కావడం విశేషం.
ప్రేమ, పెళ్లి పుకార్లు
2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'గీత గోవిందం', ఆ తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాలతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2020 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, సీక్రెట్‌గా వెకేషన్లకు వెళ్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట మాత్రం తమ బంధం గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా నోరు విప్పలేదు.
గతంలో రష్మిక కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని, 2018లో బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్-రష్మిక జంటగా వెకేషన్‌కు వెళ్లడంతో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


