...
...
Next Story

Ravi Babu: మన హీరోలందరూ అంతే.. 90 శాతం మంది డూప్ లేనిదే ఫైట్ చేయరు.. అవి రెండూ ఉంటే ఏ ఎధవైనా సినిమా చేయగలడు: రవిబాబు

Ravi Babu: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే ఫైట్స్ చేస్తున్నారని, రియాలిటీకి దూరంగా యాక్షన్ సీన్లు ఉంటున్నాయని దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన 'రేజర్' మూవీ మే 8న విడుదలవుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Published on: Apr 28, 2026, 19:23:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ravi Babu: టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నటుడు, దర్శకుడు రవిబాబు. హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా ఏ జోనర్ ఎంచుకున్నా అందులో తనదైన ముద్ర వేస్తుంటారు. ప్రస్తుతం ఆయన తన దర్శకత్వంలోనే నటిస్తూ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రేజర్' (Razor) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు.. టాలీవుడ్ స్టార్ హీరోల యాక్షన్ సీక్వెన్స్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హీరో గారికి ఫ్యాన్స్ లేరు కానీ ఎలివేషన్లు కావాలి

Ravi Babu: మన హీరోలందరూ అంతే.. 90 శాతం మంది డూప్ లేనిదే ఫైట్ చేయరు.. అవి రెండూ ఉంటే ఏ ఎధవైనా సినిమా చేయగలడు: రవిబాబు
Ravi Babu: మన హీరోలందరూ అంతే.. 90 శాతం మంది డూప్ లేనిదే ఫైట్ చేయరు.. అవి రెండూ ఉంటే ఏ ఎధవైనా సినిమా చేయగలడు: రవిబాబు

తెలుగు సినిమాల్లో యాక్షన్ సీన్లు అన్నీ ఒకేలా ఉంటున్నాయని, అందులో సహజత్వం లోపిస్తోందని రవిబాబు అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో 90 శాతం మంది డూపుల సహాయంతోనే ఫైట్స్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి దగ్గరగా ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు మన దగ్గర రావడం లేదు. అమెరికాలో ఒక కారు ఛేజ్ సీన్ జరుగుతుందంటే జనం నమ్ముతారు. ఎందుకంటే అక్కడ అవి జరుగుతుంటాయి. కానీ మన సినిమాల్లో లాజిక్ లేకుండా బీభత్సమైన ఛేజ్‌లు చూపిస్తున్నారు" అని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక కావాల్సినంత టైమ్, డబ్బు.. ఇవి రెండూ ఇస్తే ఏ ఎధవైనా సినిమా చేయగలడు అని కూడా ఈ సందర్భంగా రవిబాబు అనడం విశేషం.

రియాలిటీ ఉంటేనే క్రేజ్..

సినిమా అనేది ఒక మిస్టరీలా ఉండాలని, కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతా బహిర్గతమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"గతంలో మద్రాస్‌లో షూటింగ్‌లు జరిగేటప్పుడు నటీనటులను చూడటం ఒక అదృష్టంగా భావించేవారు. కానీ ఇప్పుడు పబ్లిసిటీ పేరుతో ప్రతిదీ ఫోన్లలో కనిపిస్తోంది. దీనివల్ల ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది" అని వివరించారు. తాను ఎప్పుడూ కొత్త వారితోనే సినిమాలు చేస్తానని, స్టార్లతో కథాబలమున్న సినిమాలు చేయడం కష్టమని ఆయన కుండబద్దలు కొట్టారు.

రవిబాబు దర్శకత్వంలో వస్తున్న 'రేజర్' మూవీ మే 8న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో తనీష్, బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

డూపులు లేకుండా, సహజమైన యాక్షన్ తో ఈ సినిమాను రూపొందించినట్లు రవిబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనలాగా ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండి.. ఫైట్లను చాలా సీరియస్ గా చేసే వాళ్లు ఎవరూ కనిపించలేదని, అందుకే మూవీలో ఒక పాత్రను తానే చేసినట్లు కూడా ఈ సందర్భంగా రవిబాబు తెలిపారు. మరి ఈ ‘రేజర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. రవిబాబు చేసిన తాజా వ్యాఖ్యల సారాంశం ఏమిటి?

తెలుగు హీరోలు ఫైట్ సీన్లలో డూపులను ఎక్కువగా వాడుతున్నారని, యాక్షన్ సీన్లు రియాలిటీకి దూరంగా ఉంటున్నాయని ఆయన విమర్శించారు.

2. రవిబాబు దర్శకత్వం వహించిన 'రేజర్' మూవీ ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 8, 2026న విడుదల కానుంది.

3. 'రేజర్' చిత్రంలో ప్రధాన తారాగణం ఎవరు?

ఈ సినిమాలో రవిబాబుతో పాటు తనీష్, బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe