మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా భర్తమహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్ నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
జనవరి 13న సంక్రాంతి కానుకగా

సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భర్త మహాశయులక విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రవితేజ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
దాదాపు అన్నీ హిట్ అయ్యాయి
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను" అని అన్నారు.
ఎక్కువ మాట్లాడరు
"కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృథ్వీ ఇందులో ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్‌లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్‌తో చేశారు" అని రవితేజ తెలిపారు.
నెక్ట్స్ శివతో చేస్తున్నా
"ఇందులో సునీల్‌తో మళ్లీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య, కిషోర్, మురళీధర్ గారు, గెటప్ శీను, సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్లతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్‌లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్ట్స్ శివ నిర్వాణతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం" అని రవితేజ అన్నారు.
డైరెక్టర్ డ్యాన్స్ ఇరగదీసారు
"బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రమోషన్స్‌లో డాన్స్ ఇరగదీసారు" అని రవితేజ పేర్కొన్నారు.
పవన్ టైటిల్ ఇచ్చాడు
{{/usCountry}}"బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రమోషన్స్‌లో డాన్స్ ఇరగదీసారు" అని రవితేజ పేర్కొన్నారు.
పవన్ టైటిల్ ఇచ్చాడు
{{/usCountry}}"ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్‌గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్‌లో కలుద్దాం" అని రవితేజ చెప్పుకొచ్చాడు.