Emmy OTT: ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు ఇండియ‌న్ ఓటీటీ వెబ్ సిరీస్‌-ఎమ్మీ అవార్డుకు నామినేట్‌- రియల్ స్టోరీ- వెంట‌నే చూసేయండి

Emmy OTT: ఇండియా సత్తాను ఇంటర్నేషనల్ రేంజ్ లో చాటింది ఈ వెబ్ సిరీస్. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయి సంచలనం క్రియేట్ చేసింది. ఫుట్‌బాల్ తో మారిన జీవితాల కథతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేయండి.

Published on: Sep 24, 2026, 13:14:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Emmy OTT: సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' సిరీస్ ఇంటర్నేషనల్ లెవల్ లో అదరగొట్టింది. ప్రతిష్టాత్మక 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026లో డ్రామా సిరీస్ విభాగంలో నామినేషన్ దక్కించుకుని సంచలనం క్రియేట్ చేసింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు ఇండియ‌న్ ఓటీటీ వెబ్ సిరీస్‌-ఎమ్మీ అవార్డుకు నామినేట్‌- మస్ట్ వాచ్- వెంట‌నే చూసేయండి
ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు ఇండియ‌న్ ఓటీటీ వెబ్ సిరీస్‌-ఎమ్మీ అవార్డుకు నామినేట్‌- మస్ట్ వాచ్- వెంట‌నే చూసేయండి

ఇంటర్నేషనల్ లెవల్

మానవ్ కౌల్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ హిందీ డ్రామా సిరీస్ రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.. యుకేకి చెందిన 'ఎ థౌజండ్ బ్లోస్', ఫ్రాన్స్ రూపొందించిన 'కారెమ్', అలాగే అర్జెంటీనాకు చెందిన 'మేనెమ్' వంటి అంతర్జాతీయ సిరీస్‌లతో పోటీ పడుతోంది.

జమ్మూ కశ్మీర్ నుంచి భారతదేశపు టాప్-టైర్ ఐ-లీగ్‌కి చేరుకున్న మొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కశ్మీర్‌లో ఒక చిన్న క్రీడా ప్రయాణంగా ప్రారంభమైన ఈ స్టోరీ, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడేలా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

100 ఫుట్‌బాల్‌లతో మొదలైన విప్లవం

ఈ రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ వెబ్ సిరీస్ కథ వెనుక అత్యంత ఎమోషనల్ రియల్ స్టోరీ ఉంది. సెప్టెంబర్ 2014లో సంభవించిన భయంకరమైన వరదలు కశ్మీర్ లోయను ముంచెత్తినప్పుడు వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆ సమయంలో రిపోర్టర్ షమీమ్ మేరాజ్, వ్యాపారవేత్త సందీప్ ఛాటూ తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లోని స్థానిక యువతకు 100 ఫుట్‌బాల్స్ పంపిణీ చేశారు.

రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్

ఆ చిన్న ప్రయత్నమే 2016లో శ్రీనగర్‌లో 'స్నో లెపర్డ్స్' అని పిలవబడే 'రియల్ కశ్మీర్ ఎఫ్‌సి' క్లబ్ ఆవిర్భావానికి పునాది వేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల సమయంలో మేరాజ్ తన భార్య నగలను సైతం తాకట్టు పెట్టి క్లబ్‌ను నడిపారు. చివరికి 2017-18 సీజన్‌లో ఐ-లీగ్ 2వ డివిజన్‌లో అజేయంగా నిలిచి టాప్ డివిజన్‌కు అర్హత సాధించింది. అంతేకాకుండా 2020, 2022లలో ఐఎఫ్‌ఏ షీల్డ్‌ను గెలుచుకుని భారత ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.

మానవ్ కౌల్ ఎమోషనల్

ఇంటర్నేషనల్ ఎమ్మీ నామినేషన్ వార్త వినగానే తనకు నోట మాట రాలేదని నటుడు మానవ్ కౌల్ సంతోషం వ్యక్తం చేశారు. తాను ప్యారిస్‌లో ఉన్న సమయంలో కంగ్రాచ్యులేషన్స్ మెసేజ్ రావడంతో మొదట దర్శకుడు మహేష్ మథాయ్‌కి ఫోన్ చేశానని, ఆయన కూడా నమ్మలేక ఎమ్మీ అధికారిక పేజీని చెక్ చేసుకున్నారని మానవ్ వెల్లడించారు.

ఒక కశ్మీరీగా ఈ సినిమా తనకు కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, కష్టకాలంలో కూడా నమ్మకంతో మార్పు సాధించవచ్చనే మనుషుల ఆశకు ఈ కథ నిదర్శనమని మానవ్ చెప్పారు. ఈ సిరీస్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదని తాను ఎప్పుడూ భావించేవాడినని, ఇప్పుడు ఎమ్మీ నామినేషన్‌తో ఈ కథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చేరువవుతుందనే నమ్మకం కలిగిందని మానవ్ కౌల్ వ్యాఖ్యానించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More