Reporting Live Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ.. ఇసుక మాఫియా.. తమిళ స్టార్ నటుడే విలన్.. ఎలా ఉందంటే?

Reporting Live Review: నెట్‌ఫ్లిక్స్ లోకి తాజాగా వచ్చిన థ్రిల్లర్ మూవీ రిపోర్టింగ్ లైవ్. ఈ సినిమాలో పరిణీతి చోప్రా లీడ్ రోల్లో నటించగా.. తమిళ నటుడు నాజర్ విలన్ పాత్రలో కనిపిస్తారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అసలు కథేంటి? ఈ వీకెండ్ చూడొచ్చా అనే విశేషాలు తెలుసుకోండి.

Published on: Oct 10, 2026, 14:15:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Reporting Live Review: బాలీవుడ్ టాలెంటెడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రిపోర్టింగ్ లైవ్’. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వం వహించారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, ఇసుక మాఫియా అరాచకాలను ఎండగట్టే సాహసోపేతమైన జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ రూపొందింది. ప్రముఖ తమిళ నటుడు నాజర్ విలన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

Reporting Live Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ.. ఇసుక మాఫియా.. తమిళ స్టార్ నటుడే విలన్.. ఎలా ఉందంటే?
Reporting Live Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ.. ఇసుక మాఫియా.. తమిళ స్టార్ నటుడే విలన్.. ఎలా ఉందంటే?

రిపోర్టింగ్ లైవ్ మూవీ కథేంటంటే?

రిపోర్టింగ్ లైవ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే అడుగుపెట్టింది. శుక్రవారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే అందుబాటులోకి వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పవరేంటో చూపించిన సినిమా ఇది. ఇసుక మాఫియా ఆగడాలు, దాని వెనుక వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతి గురించి కళ్లకు కట్టింది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 'ఆజాద్ భారతి' అనే ప్రముఖ టీవీ నెట్‌వర్క్‌లో పని చేసే న్యూస్ రిపోర్టర్ సంధ్య (పరిణీతి చోప్రా), కెమెరామెన్ వినోద్ (దేవెన్ భోజాని) చుట్టూ తిరిగే కథ ఇది. వీళ్లిద్దరూ కలిసి ముంబై సమీపంలోని ఒక గ్రామంలో వంతెన కూలి 14 మంది స్కూలు పిల్లలు, ఓ గర్బిణి మృతి చెందిన ఘటనను కవర్ చేయడానికి వెళ్తారు.

అయితే ఆ ఘటన ద్వారా దాని వెనుక ఆ గ్రామంలో జరుగుతున్న అతిపెద్ద ఇసుక మాఫియా గురించి తెలుసుకుంటారు. అక్కడి నుంచి వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, రాజకీయ ఒత్తిళ్ల చుట్టూ కథ తిరుగుతుంది.

సొంత ఛానెల్లోనే సవాళ్లు

సంధ్య, వినోద్‌లు తమ ఛానెల్ కోసం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారిస్తారు. అనుమతికి మించి నదులను తవ్వుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న 'బ్రిటిష్ గోల్డ్' లేదా బ్రౌన్ గోల్డ్ మాఫియా గుట్టును రట్టు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో శివ (అమోల్ పాలేకర్), మంగేష్ (పిటోబాష్ త్రిపాఠి) వంటి ఆ గ్రామానికి చెందిన ఉద్యమకారులు వీరికి కీలకమైన సమాచారాన్ని అందించి, రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు.

మరోవైపు హెడ్ ఆఫీస్‌లో ఛానెల్ హెడ్ విదుర్ (ఆదిల్ హుస్సేన్), ఛానెల్ ఓనర్ శ్యామ్ (శేఖర్ సుమన్) మధ్య ఎడిటోరియల్ స్వేచ్ఛపై జరిగే వాదనలు వాస్తవ మీడియా పరిస్థితులకు అద్దం పడతాయి. సొంత ఛానెల్లోనే సంధ్య, వినోద్ ఎదుర్కొనే సవాళ్లు కూడా చాలా సహజంగా కనిపిస్తాయి. అయినా ఈ ఇద్దరూ ఆ ఇసుక మాఫియా వెనుక ఉన్న పెద్ద తలలను ఎలా బయటకు తెస్తారు? దానికి అడ్డుకట్ట వేయగలరా లేదా అన్నది మిగిలిన కథ.

వీకెండ్ చూడగల థ్రిల్లర్

ధ్రువ్ త్రిపాఠి, మిహిర్ జాదవ్‌లు రాసిన స్క్రీన్ ప్లే ఎలాంటి అనవసరపు హంగులకు పోకుండా చాలా గ్రిప్పింగ్‌గా, కేవలం 115 నిమిషాల నిడివితో పకడ్బందీగా సాగుతుంది. అయితే రన్‌టైమ్ తక్కువగా ఉండటంతో వాళ్లు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ఓ పెద్ద స్కాంను బయటకు తీసుకొచ్చే క్రమంలో న్యూస్ రిపోర్టర్లు ఎదుర్కొనే సవాళ్లను కూడా చూపించే ప్రయత్నం చేశారు.

పరిణీతి చోప్రా చాలాకాలం తర్వాత ఒక బలమైన జర్నలిస్ట్ పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సీరియస్ రోల్‌లో దేవెన్ భోజాని నటన కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మీడియాపై నమ్మకం సన్నగిల్లుతున్న ప్రస్తుత తరుణంలో, జర్నలిజం విలువలను గుర్తుచేసే ఈ 'రిపోర్టింగ్ లైవ్' నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడదగ్గ ఒక మంచి థ్రిల్లర్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More