Tamil OTT: ఈ తమిళ సిరీస్ క్రేజ్ మామూలుగా లేదు-జియోహాట్‌స్టార్‌లో కొత్త రికార్డు-10 కోట్ల గంటలకు పైగా వ్యూస్-మీరు చూశారా?
Tamil OTT: ఓటీటీలో ఓ తమిళ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఈ సిరీస్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఏకంగా 10 కోట్ల గంటలకు పైగా వ్యూస్ ను ఈ సిరీస్ రాబట్టింది. జియోహాట్‌స్టార్ ఓటీటీ హిస్టరీలోనే ఈ సిరీస్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. మరి ఈ సిరీస్ ఏంటో ఓ లుక్కేయండి.
Tamil OTT: ఓటీటీ ప్రపంచంలో రీజనల్ లాంగ్వేజ్ ఫిక్షన్ సిరీస్‌లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ (JioHotstar) లో ప్రసారమవుతున్న తమిళ ఫిక్షన్ ఒరిజినల్ సిరీస్ ‘రిసార్ట్’ (Resort) ఏకంగా 100 మిలియన్ల (10 కోట్ల) వాచ్ అవర్స్‌ను దాటి సంచలనం సృష్టించింది.

రిసార్ట్ రికార్డు
పాపులర్ తమిళ వెబ్ సిరీస్ రిసార్ట్ ఓటీటీలో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. జియోహాట్‌స్టార్ చరిత్రలోనే ఈ మైలురాయిని దాటిన తొలి తమిళ ఫిక్షన్ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా ‘రిసార్ట్’ చరిత్రకెక్కింది.
ప్రవీణ్ బెన్నెత్ దర్శకత్వం వహించిన 'రిసార్ట్' సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌లోకి అడుగుపెట్టిన నాటి నుంచే డిజిటల్ వీక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ రాబట్టింది.
తొలి తమిళ ఫిక్షన్ ఒరిజినల్ రికార్డు
సాధారణంగా ఓటీటీల్లో 100 మిలియన్ వాచ్ అవర్స్ సాధించడం అనేది భారీ బడ్జెట్ సినిమాలు లేదా పాన్-ఇండియా రియాలిటీ షోలకే సాధ్యమయ్యేది. కానీ ఒక రీజనల్ కల్చరల్ కామెడీ అండ్ డ్రామా సిరీస్ ఈ స్థాయి వ్యూవర్ షిప్ సాధించడం డిజిటల్ స్పేస్‌లో పెద్ద మైలురాయి.
ఇండియా వైడ్ గా
కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా ఈ సిరీస్ మొత్తం ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఆయా భాషల డిజిటల్ ఆడియన్స్ ఈ సిరీస్‌ను ఆదరించడం వల్ల 'రిసార్ట్' ఆల్-ఇండియా వైడ్ ట్రెండింగ్ సిరీస్‌గా మారింది.
92 ఎపిసోడ్లు
రిసార్ట్ సిరీస్ ఓటీటీలో నిలకడగా అదరగొడుతూనే ఉంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లో 92 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. భారీ యాక్షన్ లేదా డార్క్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మాత్రమే ఓటీటీలో వర్కవుట్ అవుతాయనే పాత భావనను 'రిసార్ట్' సక్సెస్ పూర్తిగా తుడిచిపెట్టేసింది.
ఒక టూరిస్ట్ రిసార్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక సన్నివేశాలు, క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా వీక్షకులను రీ-వాచ్ చేసేలా ప్రేరేపించాయి.
సీజన్ ఎండింగ్
రిసార్ట్ సిరీస్ సీజన్ 1 ఎండింగ్ కు చేరుకుంటుంది. రీసెంట్ గా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు. మార్చి 13 నుంచి ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం 4 ఎపిసోడ్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 92 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మిగిలిన 8 ఎపిసోడ్లను ఈ నెలలోనే రిలీజ్ చేసి 100 ఎపిసోడ్లతో సీజన్ ను ముగించనున్నారు.
విజయ్ కుమార్ రాజేంద్రన్, అభినయ నేత్రన్ ఈ రిసార్ట్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ ఊరి అబ్బాయి కథ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. అతను సిటీకి వచ్చి చెఫ్ కావాలనుకుంటాడు. అతని కల నెరవేరిందా? లేదా? అనేది ఈ సిరీస్ లో చూడొచ్చు.
'రిసార్ట్' సాధించిన 100 మిలియన్ వాచ్ అవర్స్ రికార్డు, రీజనల్ లాంగ్వేజ్ ఫిక్షన్ కంటెంట్‌కు భారత్‌లో ఉన్న అపరిమితమైన మార్కెట్ పొటెన్షియల్‌ను నిరూపించింది. స్టార్ కాస్ట్ కంటే కథనంలో ఉన్న ఫ్రెష్‌నెస్, హ్యూమర్‌కు ఆడియన్స్ పట్టం గడతారని చెప్పడానికి ఈ విజయం పక్కా ఉదాహరణ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


