...
...
Next Story

ఓటీటీలోకి ఒకరోజు ముందే ఇవాళ వచ్చేసిన 250 కోట్ల రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- 7.9 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఇవాళ రూ. 250 కోట్ల సినిమా రెట్రో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారి జోడీ కట్టిన ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన రెట్రో ఓటీటీ రిలీజ్ వివరాలపై లుక్కేద్దాం.

Published on: May 30, 2025, 08:43:22 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. కంగువా వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత సూర్య నటించిన సినిమా ఇది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. సూర్య, పూజా హెగ్డే తొలిసారిగా జోడీ కట్టిన సినిమా ఇది.

డీ గ్లామర్ లుక్‌లో పూజా హెగ్డే

ఓటీటీలోకి ఒకరోజు ముందే ఇవాళ వచ్చేసిన 250 కోట్ల రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- 7.9 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ఒకరోజు ముందే ఇవాళ వచ్చేసిన 250 కోట్ల రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- 7.9 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్!

అలాగే, రెట్రో మూవీలో మొదటిసారిగా పూజా హెగ్డే డీ గ్లామర్లుక్‌లో కనిపించి అలరించింది. తమిళ పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రెట్రో మూవీకి దర్శకత్వం వహించారు. అటు సూర్య, ఇటు పూజా హెగ్డేకు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. దీంతో ఈ ఇద్దరు కలిసి నటించిన రెట్రో మూవీపై విడుదల సమయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మే డే సందర్భంగా మే 1న రెట్రో మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, రెట్రో మూవీకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తమిళంలో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ అనిపించుకుంది రెట్రో. కానీ, కొన్ని సీన్స్, సూర్య నటన, పూజా హెగ్డే ప్రజెన్స్ చాలా బాగున్నాయని, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని ప్రశంసలు కూడా వచ్చాయి.

రెట్రో బడ్జెట్ అండ్ కలెక్షన్స్

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రెట్రో మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో మలయాళ పాపులర్ యాక్టర్ జోజు జార్జ్, జయరాం, శ్రియా శరణ్, నాజర్, స్వాసిక, ప్రకాష్ రాజ్, కరుణాకరన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన రెట్రో మూవీకి సుమారుగా రూ. 60 నుంచి 65 కోట్ల బడ్జెట్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో రెట్రో ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మలయాళ వంటి ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ముందుగా మే 31న రెట్రోను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ, ఒకరోజు ముందుగానే రెట్రో ఓటీటీ రిలీజ్ అయింది.

ఇదిలా ఉంటే, రెట్రో సినిమా పారి కన్నన్ (సూర్య), రుక్మిణి (పూజా హెగ్డే), గ్యాంగ్‌స్టర్ తిలక్ జోజు జార్జ్) పాత్రల చుట్టూ తిరుగుతుంది. గ్యాంగ్‌స్టర్ అయిన పెంచిన తండ్రి దగ్గర పెరిగిన పారి రౌడీగా మారుతాడు. రుక్మిణి ప్రేమ కోసం రౌడీయిజం మానేస్తానని, పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. కానీ, పెళ్లి రోజే పారి కన్నన్ కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే రెట్రో కథ.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks