Richest Producer: ఈ ప్రొడ్యూసర్ సంపద విలువ రూ.26 వేల కోట్లు.. ఇండియాలోనే రిచెస్ట్.. షారుక్, కరణ్ జోహార్ కలిపినా ఎక్కువే
Richest Producer: ఇండియాలో రిచెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? అతని మొత్తం సంపద విలువ రూ.26 వేల కోట్లు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ప్రముఖ ప్రొడ్యూసర్లు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాల సంపద కలిపినా అతన్ని దాటలేరు.
ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2026 ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కళానిధి మారన్ అత్యంత సంపన్న మూవీ ప్రొడ్యూసర్ గా అగ్రస్థానంలో నిలిచారు. రూ. 26,000 కోట్ల సంపదతో ఆయన బాలీవుడ్ దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టారు.

ఎవరీ భారత్ రిచెస్ట్ ఫిల్మ్ మేకర్?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రభావవంతమైన, అత్యంత సంపన్న వ్యక్తులతో కూడిన వార్షిక బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. 2026 ఏడాదికి గాను ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 4,000 మంది కుబేరులకు చోటు దక్కగా, అందులో భారత్ నుంచి 300 మందికి పైగా ప్రముఖులు ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇండియన్ మీడియా మొఘల్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా ఆయనే భారత్‌లో అత్యంత సంపన్న చిత్ర నిర్మాతగా కిరీటాన్ని దక్కించుకున్నారు.
వ్యాపార దిగ్గజం కళానిధి మారన్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ధనిక చిత్ర నిర్మాతగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ దాదాపు 2.8 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 26,000 కోట్లు). ఆయనకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' ద్వారా ఈ సంపదలో మెజారిటీ భాగం సమకూరింది. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సన్ పిక్చర్స్.. రోబో (Enthiran), పేట, బీస్ట్, జైలర్ వంటి భారీ బ్లాక్ బస్టర్లను అందించింది. ప్రస్తుతం రజనీకాంత్, అల్లు అర్జున్ లతో మూవీస్ చేస్తున్నారు.
బాలీవుడ్ దిగ్గజాల కంటే ఎంతో ముందు..
ఈ రేసులో కళానిధి మారన్ మరో ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలాను వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్ జాబితాలో వినోద రంగం నుండి చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రోనీ మాత్రమే. ఆయన ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలతో పోల్చి చూస్తే మారన్ సంపద ఆశ్చర్యపోయే స్థాయిలో ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (రూ. 7,500 కోట్లు), ఆదిత్య చోప్రా (రూ. 7,700 కోట్లు), కరణ్ జోహార్ (రూ. 2,000 కోట్లు) ఆస్తులన్నీ కలిపినా కళానిధి మారన్ ఆస్తిలో సగం కూడా ఉండవంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పత్రికా వ్యాపారం నుంచి వేల కోట్ల సామ్రాజ్యం దాకా..
కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ కుమారుడైన కళానిధి మారన్.. 80వ దశకంలో తమ కుటుంబానికి చెందిన చిన్న పత్రికా ప్రచురణ సంస్థతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1993లో ఆయన 'సన్ టీవీ నెట్‌వర్క్'ను స్థాపించారు. నేడు ఇది 37 ఛానెళ్లతో, భారత్ లోని 14 కోట్ల ఇళ్లకు చేరువైన ఒక ప్రాంతీయ టెలివిజన్ దిగ్గజంగా ఎదిగిందని ఫోర్బ్స్ పేర్కొంది.
టెలివిజన్ రంగంతో పాటు వార్తాపత్రికలు, రేడియో, డీటీహెచ్ సర్వీసుల్లోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాకుండా క్రీడా రంగంలోనూ మారన్ తన ముద్ర వేశారు. ఐపీఎల్ జట్టు 'సన్‌రైజర్స్ హైదరాబాద్', దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో 'సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్', యూకేలో 'సన్‌రైజర్స్ లీడ్స్' జట్లను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఆయన భార్య కావేరి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కంటెంట్ బాధ్యతలు చూస్తుండగా, కుమార్తె కావ్యా మారన్ క్రికెట్ ఫ్రాంచైజీలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


