...
...
Next Story

S Janaki: జానకమ్మ స్పెషాలిటీ ఇదే-పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడిగా పాటలు పాడిన ఏకైక సింగర్- ఈ సాంగ్స్ అవే!

S Janaki: సాధారణంగా ఒకే గొంతుతో పాటలు పాడేవాళ్లను సింగర్ అంటారు. కానీ పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడిగా గొంతు మారుస్తూ పాడేవారిని ఎస్.జానకమ్మ అంటారు. అవును.. ఆమె వాయిస్ మ్యాజిక్ చేసింది. జానకమ్మ ఒక్కరికే సాధ్యమైన ఆ స్పెషల్ సాంగ్స్ ఏంటో ఓ లుక్కేయండి.

Published on: Jul 11, 2026, 21:47:00 IST
Advertisement

S Janaki: భారత సినీ చరిత్రలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది పాటలు పాడారు, ఇంకా పాడుతున్నారు. కానీ ఈ వేలాది సింగర్స్ మధ్యలో ఎప్పటికీ వెలిగిపోయే దిగ్గజాలు కొందరే ఉంటారు. ఆ దిగ్గజాల్లో అత్యంత ప్రత్యేకం మన జానకమ్మ. అందరూ పాటలు పాడతారు. కానీ ఆమెలా మాత్రం పాడలేరు.

పాటలు సజీవం

జానకమ్మ గొంతు పలికిన భావాలెన్నో.. పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడిగా పాటలు పాడిన ఒకే ఒక్క సింగర్! (x/sunpictures)
జానకమ్మ గొంతు పలికిన భావాలెన్నో.. పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడిగా పాటలు పాడిన ఒకే ఒక్క సింగర్! (x/sunpictures)

సంగీత లోకాన్ని వదిలి, ఈ ప్రపంచాన్ని విడిచి ఎస్.జానకి వెళ్లిపోయారు. శనివారం (జూలై 11) ఆమె తుదిశ్వాస విడిచారు. కానీ మరణం ఆమెను భౌతికంగానే దూరంగా చెసిందంతే. పాటల రూపంలో జానకమ్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ఇక ఆమె పాడిన కొన్ని పాటలు అయితే జానకమ్మ స్పెషాలిటీని చాటి చెప్తాయి.

ఇదే జానకమ్మ స్పెషాలిటీ

సింగర్స్ ఎవరైనా ఒకే గొంతుతో పాటలు పాడతారు. అవసరానికి తగ్గట్లు శ్రుతి పెంచుతారు, తగ్గిస్తారు. కానీ గొంతును వేర్వేరు రకాలుగా మార్చి పాడటం కష్టమే. కానీ ఆ కష్టమైన పనిని చాలా సులభంగా చేశారు జానకమ్మ. ఒక పిల్లాడిగా, అమ్మాయిగా, మగాడిగా, ముసలావిడిగా తన గొంతును మార్చి మరీ పాటలు పాడిన ఘనత ఆమె సొంతం.

ఈ సాంగ్స్ అవే

జానకమ్మ ఏదో ఒకటి రెండు పాటలు మాత్రమే ఇలా గొంతు మార్చి పాడలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో 50కి పైగా పాటలను ఇలా గొంతు మార్చి పాడారు. మరే సింగర్ కు సాధ్యం కాని ఘనత ఇది. జానకమ్మ తొలిసారిగా తమిళంలో ‘కన్నా నీ ఎంగే’ అనే పాటను కిడ్ వాయిస్ లో పాడారు.

ఇంకా తెలుగులో ‘పాటంటే పాట కాదు’, ‘ఆ దీపమెలా వెలిగేది’, ‘అమ్మా నాన్న’, ‘గున్న మామిడి’, ‘రావే రావే చందమామ’, ‘హలో హలో ఓ తాతయ్య’, ‘నడిచేది జీవుడు’, ‘పుట్టింటి బొమ్మ’, ‘నీకేల కోపం శంకర’, ‘వెన్నెలైనా చీకటైనా’ అనే పాటలను పిల్లల గొంతుతో పాడారు. పిల్లల్లోనూ ఆడ, మగ వాయిస్ తో పాటలు పాడటం జానకమ్మకే చెల్లింది.

ఇవీ అద్భుతాలే

ఇక ముసలావిడ గొంతుతో ‘అలక పానుపు’, ‘కట్టు కథలు’, ‘ఎంత సోగ్గున్నావో’, ‘పోరా పోరా కృష్ణ‌’ అనే తెలుగు పాటలు పాడారు జానకమ్మ. టీనేజర్ వాయిస్ తో ‘పాపపేరు మల్లి’ అనే పాట పాడారు. పురుష గొంతుతో మలయాళంలో ఓ సాంగ్ పాడారు.

ఇలా ఒకే గొంతుతో వేర్వేరు వేరియేషన్స్ చూపించడం ఒక్క జానకమ్మ వల్లే సాధ్యమైంది. అందుకే ఆమె ప్రత్యేకం. ఆమె పాటలు ప్రత్యేకం. ఆమె ప్రస్థానమే ప్రత్యేకం. పాటలు ఉన్నంత కాలం జానకమ్మ గొంతు శాశ్వతం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks