Sahaa Movie: తెలుగులో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 4) రిలీజైన సినిమాల్లో ఒకటి సహ. ఓ లోబడ్జెట్ మూవీ కావడం దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. బన్నీ వాస్ లాంటి నిర్మాతలు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చినా ఫలితం లేకపోయింది. కేవలం 20 థియేటర్లు మాత్రమే ఇవ్వడంపై ఓ థియేటర్లో ఇందులో నటించిన హీరో శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
అంతా చేస్తే 20 థియేటర్లు ఇస్తారా?

ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద మూవీస్ ఏవీ లేకపోయినా.. పలు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో సహ అనే సినిమాకు పెద్దగా థియేటర్లు దొరకలేదు. దీనిపై ఈ మూవీ హీరో శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ థియేటర్లో ప్రేక్షకులతో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.
“ఎంతో కష్టపడ్డాం. ఆలౌట్ వెళ్లి నంబర్లు ఇచ్చి.. గుండు కొట్టించుకుంటామన్న స్టేట్‌మెంట్లు ఇచ్చి.. నానా సంకలు నాకి ప్రమోట్ చేస్తే సినిమాని.. కేవలం 20 థియేటర్లు ఇచ్చారు భయ్యా.. ఆ 20 థియేటర్లు కూడా కావాలని ఇచ్చినట్లు కేవలం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు ఇచ్చారు. అసలు ఎవరైనా మార్నింగ్, మ్యాట్నీలు చూస్తారా?” అని ఎమోషనల్ అయ్యాడు. దీంతో డైరెక్టర్ అతన్ని సముదాయిస్తూ.. మీకు సినిమా నచ్చితే అందరికీ చెప్పండి.. అలా అయితే నెక్ట్స్ వీక్ కూడా ఆడుతుంది.. లేదంటే ఈ రెండు రోజులే మా సినిమా అని అన్నాడు.
రిలీజ్‌కు ముందు ఛాలెంజ్‌లు
నిజానికి సహ మూవీని తమకు సాధ్యమైనంత మేర మేకర్స్ బాగానే ప్రమోట్ చేశారు. ఈ సినిమా హీరో హీరోయిన్లు సవాళ్లు కూడా విసిరారు. ఈ మూవీ కంటెంట్ పరంగా చాలా పెద్ద సినిమా అని, ఇది నచ్చకపోతే నా నంబర్ ఇస్తాను.. ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టండి అని హీరో శివ కుమార్ సవాలు విసురుతూ తన నంబర్ ఇచ్చాడు. అంతేకాదు తమ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేస్తుందన్నాడు.
అటు హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ అయితే ఈ సినిమా నచ్చకపోతే తాను అమీర్‌పేట సెంటర్లో గుండు కొట్టించుకున్నానని అనడం విశేషం. ఈ రెండు వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అయితే తమ కంటెంట్ మీద మేకర్స్ కు మంచి నమ్మకమే ఉన్నా.. థియేటర్లు దొరకకపోవడంతో ప్రేక్షకులకు రీచ్ కావడం లేదన్న ఆవేదన వాళ్లలో కనిపిస్తోంది. ఆ బాధలోనే హీరో ఇలా ఆవేదనగా మాట్లాడినట్లు అర్థమవుతోంది.
సహ మూవీకి పాజిటివ్ రివ్యూలు
{{/usCountry}}అటు హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ అయితే ఈ సినిమా నచ్చకపోతే తాను అమీర్‌పేట సెంటర్లో గుండు కొట్టించుకున్నానని అనడం విశేషం. ఈ రెండు వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అయితే తమ కంటెంట్ మీద మేకర్స్ కు మంచి నమ్మకమే ఉన్నా.. థియేటర్లు దొరకకపోవడంతో ప్రేక్షకులకు రీచ్ కావడం లేదన్న ఆవేదన వాళ్లలో కనిపిస్తోంది. ఆ బాధలోనే హీరో ఇలా ఆవేదనగా మాట్లాడినట్లు అర్థమవుతోంది.
సహ మూవీకి పాజిటివ్ రివ్యూలు
{{/usCountry}}ఈ సహ మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాను లవ్ స్టోరీ అని చెప్పి కేవలం లవ్ మీదే ఆధారపడకుండా ఎమోషన్స్, రిలేషన్షిప్స్ ను కూడా బాగా చూపించారని, కొన్ని ఎమోషనల్ సీన్స్ కు చాలా కనెక్ట్ అవుతామని ఓ ప్రేక్షకుడు తన రివ్యూలో చెప్పారు.