రోజుకు 30 గుడ్లు.. యోగా.. 45 రోజుల్లోనే సిక్స్ ప్యాక్ బాడీ.. తల్లి గైడెన్స్‌లోనే..: సయ్యారా స్టార్ జర్నీ ఇలా
సయ్యారా మూవీతో స్టార్ హీరోగా మారిపోయిన అహాన్ పాండే తన ఫిజిక్ కోసం పాటించిన డైట్, చేసిన పనులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు తన తల్లి గైడెన్స్ లోనే అతడు మూవీ కోసం తన లుక్ పూర్తిగా మార్చుకోవడం విశేషం.
బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే మంగళవారం అంటే డిసెంబర్ 23న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన తొలి మూవీ 'సయ్యారా' (Saiyaara) కోసం అతడు చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాక్‌స్టార్ లుక్ కోసం రోజుకు 30 గుడ్లు తినడం దగ్గర నుంచి కఠినమైన వర్కౌట్స్ వరకు అహాన్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.

తొలి సినిమా కోసమే ఈ స్థాయిలో..
యువ నటుడు అహాన్ పాండే తన డెబ్యూ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బొద్దుగా ఉన్న అహాన్.. కేవలం 40-45 రోజుల్లోనే సిక్స్ ప్యాక్ బాడీతో రాక్‌స్టార్‌లా మారిపోయారు. ఈ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మ, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ డీన్ పాండే (Deanne Panday), ట్రైనర్ అజర్ జహీర్ షేక్‌లదే.
అహాన్ తల్లి డీన్ పాండే ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు. బిపాసా బసు, జాన్ అబ్రహం వంటి స్టార్లకు ఆమె ట్రైనింగ్ ఇచ్చింది. అహాన్ డైట్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించింది.
రోజుకు 30 గుడ్లు
సయ్యారా మూవీ షూటింగ్ కోసం చివరి మూడు నెలలు అహాన్ కేవలం తన కోసం ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకున్నాడు. కండలు పెంచడానికి అహాన్ రోజుకు 30 గుడ్లు తినేవాడట. "మజిల్ రావాలంటే రోజుకు 30 గుడ్లు తినాల్సిందే.. షార్ట్ కట్స్ లేవు" అని ట్రైనర్ అజర్ తెలిపాడు.
బ్రేక్‌ఫాస్ట్ లో భాగంగా గుడ్లు, ఓట్స్, అవకాడో.. ఇక లంచ్ లో గ్రిల్డ్ చికెన్, బ్రౌన్ రైస్, కూరగాయలు.. డిన్నర్ లో సూప్ లేదా సాలడ్. డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ షేక్స్ కూడా తీసుకునేవాడు.
45 రోజుల్లో 9 కిలోలు తగ్గి..
ట్రైనింగ్ మొదలుపెట్టే సమయానికి అహాన్ కాస్త లావుగా ఉండేవాడు. కానీ 45 రోజుల్లోనే 8-9 కిలోల బరువు తగ్గి చాలా సన్నగా మారిపోయాడు. డైట్ తోపాటు రోజుకు 2 గంటల పాటు కఠినమైన సాధన చేసేవాడు.
వెయిట్ ట్రైనింగ్, యోగా, బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, పిలేట్స్ ఇలా అన్నీ కలిపి చేసేవాడు. షూటింగ్ షెడ్యూల్స్ వల్ల కొన్నిసార్లు తెల్లవారుజామున 4 గంటలకే జిమ్‌కు వెళ్లేవాడు. షూటింగ్ గ్యాప్స్‌లో సెట్‌లోనే వర్కౌట్ చేసేవాడు.
కండరాలు రిపేర్ అవ్వాలంటే రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం. కానీ బిజీ షెడ్యూల్ వల్ల అహాన్‌కు నిద్ర సరిపోయేది కాదు. అయినా సరే క్యారవాన్‌లోనో, కారులోనో దొరికిన కాసేపు నిద్రపోతూ మేనేజ్ చేశాడు. డీహైడ్రేషన్ బారిన పడకుండా రోజుకు 4 లీటర్ల నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ తీసుకునేవాడు. అతని ఫిట్‌నెస్ జర్నీ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


