Salman Khan Virgin: సల్మాన్ ఖాన్ ఇప్పటికీ వర్జినేనా? ఇదీ అతని రియాక్షన్.. ఫోన్‌లో కెమెరా తయారు చేసినవాడు దొరకాలీ అంటూ..

Salman Khan Virgin: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదని మనకు తెలుసు. కానీ అతడు ఇప్పటికీ వర్జినేనా? ఇదే ప్రశ్నను కాఫీ విత్ కరణ్ షోలో డైరెక్టర్ కరణ్ జోహార్ అడిగారు. దీనికి అతడు చెప్పిన సమాధానం  వైరల్ అవుతోంది.

Published on: Oct 13, 2026, 14:58:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Salman Khan Virgin: బాలీవుడ్‌లో దశాబ్దాలుగా మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీ చాట్ షోగా దూసుకుపోతున్న 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) ఇప్పుడు తన చివరి సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ షో 9వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

Salman Khan Virgin: సల్మాన్ ఖాన్ ఇప్పటికీ వర్జినేనా? ఇదీ అతని రియాక్షన్.. ఫోన్‌లో కెమెరా తయారు చేసినవాడు దొరకాలీ అంటూ..
Salman Khan Virgin: సల్మాన్ ఖాన్ ఇప్పటికీ వర్జినేనా? ఇదీ అతని రియాక్షన్.. ఫోన్‌లో కెమెరా తయారు చేసినవాడు దొరకాలీ అంటూ..

అయితే ఈ ఫైనల్ సీజన్‌కు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

"నువ్వు ఇంకా వర్జిన్ గానే ఉన్నావా?".. సల్మాన్ ఫన్నీ రియాక్షన్

షో మొదలుపెట్టినప్పటి నుంచి అనేక వివాదాలు, ఆసక్తికరమైన నిజాలు, ఫన్నీ కామెంట్స్‌తో ఈ కాఫీ విత్ కరణ్ షో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే నిలిచింది. ఇప్పుడు ఫైనల్ సీజన్ కావడంతో హోస్ట్ కరణ్ జోహార్ ఎలాంటి ప్రశ్నలతో గెస్ట్‌లను ఇబ్బంది పెడతాడోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

టీజర్‌లో కరణ్ జోహార్ తనదైన శైలిలో సల్మాన్‌ను పాత ప్రశ్నలతో ఆటపట్టించడం హైలైట్‌గా నిలిచింది. గతంలో ఒక షోలో సల్మాన్‌ను అడిగిన ఆ ఫేమస్ ప్రశ్నను కరణ్ మళ్ళీ రిపీట్ చేస్తూ.. "మీరు ఇప్పటికీ వర్జినేనా?" అని అడుగుతాడు. దానికి సల్మాన్ ఏమాత్రం తడబడకుండా చాలా కూల్‌గా "కంట్రోల్.. యా బ్రదర్.. కంట్రోల్" అంటూ ఇచ్చిన ఆన్సర్ నవ్వులు పూయిస్తోంది.

అలాగే షో చివరి దశకు చేరడంపై సల్మాన్ స్పందిస్తూ.. సెలెబ్రిటీలను ఈ షోకి రప్పించడానికి కరణ్ ఆడుతున్న ప్లాన్ ఇదంటూ ఫన్నీగా జోకులు పేల్చారు. అయితే ఈ షో ముగిసిపోవడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్, పెరుగుతున్న పాపరాజీ కల్చర్‌పై సల్మాన్ తీవ్రంగా స్పందిస్తూ.. ఈ ఫోన్లలో కెమెరాలు కనిపెట్టిన వాళ్లు ఎవరైనా దొరికితే అంటూ సరదాగా ఫైర్ అయ్యారు.

2004 నుంచి నడుస్తున్న ప్రయాణానికి ముగింపు

2004లో తన తండ్రి యశ్ జోహార్‌తో కలిసి ఈ షో ఐడియా గురించి డిస్కస్ చేసిన రోజులను కరణ్ జోహార్ గుర్తు చేసుకున్నారు. మొదట్లో స్నేహితులను పిలిచి కబుర్లు చెబితే ఎవరూ డబ్బులు ఇవ్వరని ఆయన తండ్రి అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారని కరణ్ తెలిపారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇదే షో బాలీవుడ్ సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ సీక్రెట్స్‌ను బయటపెట్టే వేదికగా మారిందని పేర్కొన్నారు.

తాను ఇండస్ట్రీలోని లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌ని ఈ షోకి పిలిచానని, కొందరు ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారని, మరికొందరు పెళ్లి కూడా చేసుకున్నారని కరణ్ సరదాగా చెప్పుకొచ్చారు. నెపోటిజం లాంటి విమర్శలను తాను ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపారు. సల్మాన్ ఖాన్ ఒక్కడే కాకుండా ఈ ఫైనల్ సీజన్‌లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వంటి స్టార్లతో పాటు సౌత్ సెలెబ్రిటీలు కూడా గెస్ట్‌లుగా వచ్చే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More