Maa Inti Bangaaram: సమంత మా ఇంటి బంగారం సరికొత్త చరిత్ర.. 17 ఏళ్ల కిందటి అరుంధతి రికార్డు బ్రేక్.. అత్యధిక వసూళ్ల మూవీ

Maa Inti Bangaaram: సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లెడ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

Published on: Jul 1, 2026, 20:26:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maa Inti Bangaaram: సమంత (Samantha Ruth Prabhu)కు ఉన్న క్రేజ్ ఏంటో డైరెక్టర్ నందినీ రెడ్డి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. టాలీవుడ్ హిస్టరీలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తూ సామ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 17 ఏళ్ల క్రితం అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి' సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్‌ను మా ఇంటి బంగారం ఇప్పుడు బ్రేక్ చేసేసింది.

Maa Inti Bangaaram: సమంత మా ఇంటి బంగారం సరికొత్త చరిత్ర.. అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లెడ్ తెలుగు మూవీ
Maa Inti Bangaaram: సమంత మా ఇంటి బంగారం సరికొత్త చరిత్ర.. అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లెడ్ తెలుగు మూవీ

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

2009లో వచ్చిన అరుంధతి సినిమా టాలీవుడ్‌లో ఫీమేల్-లీడ్ సినిమాలకు ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తున్న టైమ్‌లో, అనుష్క తన అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పటినుంచి ఎంతోమంది ట్రై చేసినా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడు సమంత తన యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఆ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.

జూన్ 19న గ్రాండ్‌గా రిలీజైన మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా రూ. 83 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఇండియాలో రూ. 50 కోట్ల నెట్ వసూళ్లు సాధించి టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్-లీడ్ ఫిల్మ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. మంచి రివ్యూస్, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమాకు థియేటర్ల దగ్గర జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. "బంగారం తన హిస్టరీని సువర్ణ అక్షరాలతో రాసుకుంది.. మా ఇంటి బంగారం టాలీవుడ్ ఎవర్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్-లెడ్ ఫిల్మ్" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కొట్టిన ఈ భారీ హిట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ సామ్‌ను క్వీన్, సూపర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మహానటి, రుద్రమదేవి ఎందుకు కాదు?

అరుంధతి సినిమా అప్పట్లో రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన 'మహానటి' రూ. 75 కోట్లు, గుణశేఖర్ 'రుద్రమదేవి' రూ. 86 కోట్లు కలెక్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాల్లో కీర్తి సురేష్‌కు సపోర్ట్‌గా దుల్కర్, విజయ్ దేవరకొండ.. అలాగే అనుష్కకు సపోర్ట్‌గా అల్లు అర్జున్, రానా లాంటి స్టార్ హీరోల సపోర్ట్ ఉంది. మా ఇంటి బంగారం మాత్రం పక్కాగా సమంత వన్ ఉమన్ షో.

అయితే సౌత్ ఇండియా లెవల్‌లో చూసుకుంటే మలయాళ హిట్ 'లోకా: చాప్టర్ 1 – చంద్ర' (Lokah: Chapter 1) ఇంకా టాప్ ప్లేస్‌లోనే ఉంది. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ లీడ్ రోల్స్ చేశారు. దుల్కర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ టచబుల్ రికార్డ్‌గా నిలిచింది. ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని తాము అస్సలు ఊహించలేదని మూవీ టీమ్ సైతం షాక్ అయ్యారు.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సమంత ఈ యాక్షన్ కామెడీ డ్రామాను కంప్లీట్ చేసింది. నందినీ రెడ్డి గ్రిప్పింగ్ నెరేషన్, గుల్షన్ దేవయ్య లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ సపోర్ట్‌తో సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. సామ్ డెడికేషన్‌కు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దక్కుతున్న రిజల్ట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More