Samantha Raj Nidimoru: భర్తకు సమంత క్యూట్ బర్త్‌డే విషెస్.. రాజ్ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన సామ్

Samantha Raj Nidimoru: తన భర్త రాజ్ నిడిమోరుకు క్యూట్ బర్త్‌డే విషెస్ చెప్పింది సమంత రూత్ ప్రభు. అతని చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ.. తన జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Aug 4, 2026, 20:49:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Raj Nidimoru: ప్రముఖ దర్శకుడు, తన భర్త రాజ్ నిడిమోరు 46వ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్ సమంత రుత్ ప్రభు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టులతో విష్ చేసింది. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ నిడిమోరుకు తన భార్య సమంతతో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తాయి.

Samantha Raj Nidimoru: భర్తకు సమంత క్యూట్ బర్త్‌డే విషెస్.. రాజ్ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన సామ్
Samantha Raj Nidimoru: భర్తకు సమంత క్యూట్ బర్త్‌డే విషెస్.. రాజ్ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన సామ్

ఆగస్టు 4న రాజ్ 46వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

'మా ఇంటి బంగారం' బిహైండ్ ది సీన్స్.. సమంత షాకింగ్ నిజాలు

తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) బ్యానర్‌పై వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'మా ఇంటి బంగారం' షూటింగ్ టైమ్‌కి సంబంధించిన అన్‌సీన్ బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను సమంత రీపోస్ట్ చేసింది. ఈ సినిమాలో తాను నటించడం మొదట్లో అస్సలు ఇష్టం లేదని, కానీ రాజ్ కన్విన్స్ చేసి ఒప్పించాడని సమంత ఈ వీడియోలో రివీల్ చేసింది.

డైరెక్టర్ నందిని రెడ్డి, ప్రోడ్యూసర్ హిమాంక్ దువ్వూరు కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ షూటింగ్‌లో రాజ్ స్వయంగా కొన్ని షాట్స్ డైరెక్ట్ చేస్తున్న విజువల్స్ ఇందులో కనిపించాయి. ఇక రాజ్ డైరెక్షన్ పార్ట్‌నర్ డికే మాట్లాడుతూ, "రాజ్ నన్ను వదిలేసి సోలోగా చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇది, బాగానే చేసి ఉంటాడని ఆశిస్తున్నా" అని సరదాగా వ్యాఖ్యానించడం ఆకట్టుకుంది.

చిన్ననాటి జ్ఞాపకాలతో సోదరి ఎమోషనల్ పోస్ట్

మరోవైపు రాజ్ సోదరి శీతల్ నిడిమోరు (Sheetal Nidimoru) కూడా తమ చిన్ననాటి అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. "మనం పెరిగిన రోజులను గుర్తుచేసుకుంటే నాకు బర్త్‌డేలు, వెకేషన్లు గుర్తురావు.. సత్యసాయి బాబా భజనలు, ప్రార్థనలు, మన ఇంటికి వచ్చే స్వామీజీలే గుర్తుకొస్తారు" అని పేర్కొంది.

లైఫ్‌లో ఎన్ని మైలురాళ్లు దాటినా, ఎంత సక్సెస్ వచ్చినా రాజ్ తన సైలెంట్ నేచర్, వినయం, ఉదారతను అస్సలు వదులుకోలేదని కొనియాడింది. ఈ ఎమోషనల్ పోస్ట్‌కు సమంత క్యూట్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేసి తన ప్రేమను వ్యక్తపరిచింది.

రూ. 100 కోట్ల క్లబ్‌లో సినిమా..

కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్‌లో కొయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఎంతో ప్రశాంతంగా, యోగిక్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఈ జంట త్వరలోనే పేరెంట్స్ కూడా కాబోతున్నారు. ఈ మధ్యే సమంత తన ప్రెగ్నెన్సీని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సమంత, రాజ్ కాంబోలో రీసెంట్‌గా వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫిమేల్ లీడ్ సినిమా ఈ రేంజ్ బాక్సాఫీస్ మేజిక్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకవైపు రాజ్ డికే జోడీగా ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తుంటే, సమంత తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తోంది.

సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు విష్ చేస్తే చేసిన పోస్ట్
సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు విష్ చేస్తే చేసిన పోస్ట్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More