Samantha Vijay: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్.. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్.. ఆయనంటే చాలా చాలా ఇష్టం: సమంత కామెంట్స్ వైరల్

Samantha Vijay: 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం' షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టార్ నటి సమంత రూత్ ప్రభు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ని తన "లక్కీ చార్మ్" అని అభివర్ణించిన సమంత.. ఆయనతో కలిసి చేసిన మూడు చిత్రాలు భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు.

Published on: Oct 23, 2026, 14:00:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Samantha Vijay: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బుల్లితెరపై 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం' (Celebrity MasterChef Tamil) షోకి వ్యాఖ్యాతగా సరికొత్త అవతారంలో అలరిస్తున్నారు. సోనీ విళా (Sony VIZHA), సోనీ లివ్ (Sony LIV) లో ప్రసారమవుతున్న ఈ షోలో సమంత తనదైన నైపుణ్యం, చమత్కారమైన సంభాషణలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Samantha Vijay: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్.. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్.. ఆయనంటే చాలా చాలా ఇష్టం: సమంత కామెంట్స్ వైరల్
Samantha Vijay: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్.. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్.. ఆయనంటే చాలా చాలా ఇష్టం: సమంత కామెంట్స్ వైరల్

తాజాగా రాబోయే ఎపిసోడ్‌లో 'హీరో వర్సెస్ విలన్' ఛాలెంజ్ సందర్భంగా ఆర్జే విజయ్ (RJ Vijay) సమంతను ప్రశ్నిస్తూ.. "చిత్ర పరిశ్రమలో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్ ఎవరు?" అని అడిగారు. దీనికి సమంత ఏమాత్రం తడబడకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్ స్టార్ సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) పేరును వెల్లడించారు. అంతేకాదు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రావడం, ఈ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదని, విజయ్ శ్రమ ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

"ఆయన నా లక్కీ చార్మ్.. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు కొట్టాం!"

తమిళనాడు సీఎం విజయ్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. "విజయ్ సార్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన నా లైఫ్‌లో పక్కా 'లక్కీ చార్మ్'. ఆయనతో కలిసి నేను చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి సూపర్ హిట్లుగా నిలిచాయి" అని సమంత ఆనందం వ్యక్తం చేశారు.

సమంత, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ఏఆర్ మురుగదాస్ చిత్రం 'కత్తి' (Kaththi - 2014), అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'తేరి' (Theri - 2016), 'మెర్సల్' (Mersal - 2017) చిత్రాలు తమిళ చిత్రసీమలో సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించగా, అందులో 'మెర్సల్' మూవీ ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ సృష్టించింది.

కెరీర్ పీక్‌లో సినిమాలకు గుడ్‌బై..

నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా విజయ్ సాగిస్తున్న ప్రయాణంపై సమంత తీవ్రస్థాయిలో ప్రశంసలు కురిపించారు. "ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వెండితెరకు దూరమై పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అనేది అంత తేలికైన నిర్ణయం కాదు" అని సమంత అన్నారు.

"సినిమాలను పక్కనబెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పాలన వైపు అడుగులు వేయడం, నిశ్శబ్దంగా వెనుక ఉండి తీవ్రంగా శ్రమించడం నిజంగా గొప్ప విషయం. శ్రమించే తత్వానికి, పట్టుదలకు విజయ్ సార్ ఒక గొప్ప ఉదాహరణ. సరైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తన మార్క్ చూపించారు" అని వ్యాఖ్యానించారు.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తమిళనాడు సీఎం వరకు..

1984లో తన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'వెట్రి' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన విజయ్, 1992లో 'నాళైయ తీర్పు' చిత్రం ద్వారా హీరోగా మారారు. 1996లో వచ్చిన 'కోయంబత్తూర్ మాప్పిళై' ఆయన కెరీర్‌లో తొలి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిన ఆయన.. ఇటీవల వచ్చిన 'గోట్' (GOAT), 'లియో' (Leo), జన నాయగన్ చిత్రాలతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పారు.

2024లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్.. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ద్రవిడేతర పార్టీ తరఫున చారిత్రాత్మక విజయం సాధించి ఈ ఏడాది మేలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చివరి చిత్రం 'జన నాయగన్' ఇటీవల జులైలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ పొందింది.

ఇక సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఇటీవల 'మా ఇంటి బంగారం' చిత్రంతో అలరించిన ఆమె.. త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంటూనే టీవీ షోలలో పాల్గొంటోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More