SYG Release Date: సంక్రాంతికి కలుద్దామంటున్న మెగా హీరో- ఫైనల్లీ సంబరాల ఏటి గట్టు రిలీజ్ డేట్ ఫిక్స్- సాయి ధరమ్ తేజ్ లుక్

SYG Release Date: మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్) నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ విడుదల తేదీ ఖరారైంది. ఈ మూవీ 2027 సంక్రాంతి రేసుకు సై అంటోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

Published on: Aug 15, 2026, 17:35:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SYG Release Date: సంక్రాంతి పండుగ సీజన్ టాలీవుడ్‌లో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ విండో. ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. 2027 సంక్రాంతి రేసులోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దిగుతున్నాడు. అతని ‘సంబరాల ఏటి గట్టు’ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.

సంక్రాంతికి కలుద్దామంటున్న మెగా హీరో-ఫైనల్లీ సంబరాల యేటి గట్టు రిలీజ్ డేట్ ఫిక్స్-సాయి ధరమ్ తేజ్ లుక్ (x/IamSaiDharamTej)
సంక్రాంతికి కలుద్దామంటున్న మెగా హీరో-ఫైనల్లీ సంబరాల యేటి గట్టు రిలీజ్ డేట్ ఫిక్స్-సాయి ధరమ్ తేజ్ లుక్ (x/IamSaiDharamTej)

సంబరాల ఏటి గట్టు రిలీజ్ డేట్

సాయి ధరమ్ తేజ్ హీరోగా చాలా కాలం నుంచి తెరకెక్కుతున్న మూవీ ‘సంబరాల ఏటి గట్టు’. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెగా అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సినిమాను జనవరి 12, 2027న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

అదిరేలా లుక్

సంబరాల ఏటి గట్టు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ హీరో సాయి ధరమ్ తేజ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టుకుని, బట్టలపై రక్తంతో కనిపించాడు సాయి ధరమ్ తేజ్. భారీ యాక్షన్ సీన్ లో రౌడీలను చంపాలనే కోపంతో దూసుకెళ్తున్నట్లు కనిపించాడు.

జనవరి 12 అడ్వాంటేజ్

సంక్రాంతి పండుగ రోజులకు సరిగ్గా రెండు రోజుల ముందు (జనవరి 12న) రావడం ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాకు అడ్వాంటేజీ కానుంది. ఈ సినిమాకు ఫస్ట్ డే ఓపెనింగ్స్‌తో పాటు వరుసగా 4-5 రోజుల పండుగ సెలవుల అడ్వాంటేజ్ దక్కనుంది.

మాస్ అండ్ రా కాన్సెప్ట్

‘విరూపాక్ష’ లాంటి హిట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పీరియాడిక్ మాస్ అండ్ రా రస్టిక్ డ్రామా సంబరాల ఏటి గట్టు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ బజ్ పెరిగింది.

సంక్రాంతి బరిలో ఎప్పుడూ బడా హీరోల చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. జనవరి 12నే 'సంబరాల ఏటి గట్టు' రావడంతో నైజాం, సీడెడ్, ఆంధ్రా ప్రాంతాల్లో థియేటర్ల కేటాయింపు కీలకం కానుంది.

సంక్రాంతి రేసు

2027 సంక్రాంతి పోరుకు ఇప్పటి నుంచే సినిమాలు రెడీ అవుతున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘జార్జ్ క్రిష్’ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. ఇక వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ కూడా సంక్రాంతికే రానుంది. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య కాంబో మూవీ కూడా సంక్రాంతికే వస్తుందని అన్నారు.

ఇక బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేసిందని టాక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More